AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో చనిపోయిన అభ్యర్థి.. అమెరికా ఎన్నికల్లో విజయం

అమెరికాలో విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయిన అభ్యర్థి ఎన్నికల్లో విజేతగా నిలిచాడు.

కరోనాతో చనిపోయిన అభ్యర్థి.. అమెరికా ఎన్నికల్లో విజయం
Balaraju Goud
|

Updated on: Nov 04, 2020 | 2:20 PM

Share

అమెరికాలో విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయిన అభ్యర్థి ఎన్నికల్లో విజేతగా నిలిచాడు. నార్త్ డ‌కోటాకు చెందిన 55 ఏళ్ల రిప‌బ్లిక‌న్ నేత డేవిడ్ అంద‌ల్ అక్టోబ‌ర్ 5వ తేదీన కరోనా బారినపడి మ‌ర‌ణించారు. కానీ, ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న విజ‌యం సాధించారు. కరోనా వైరస్ సోకిన డేవిడ్ హాస్పిట‌ల్‌లో నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన త‌ర్వాత మ‌ర‌ణించారు. కొవిడ్‌-19తో మృతి చెందిన నెల రోజుల త‌ర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇవాళ ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో డేవిడ్ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. నార్త్ డ‌కోటాలోని బిస్‌మార్క్ ప్రాంతంలో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున డేవిడ్ అంద‌ల్‌, డేవ్ నెహ‌రింగ్‌లు పోటీప‌డ్డారు. ఈ జిల్లాలో ప్ర‌జ‌లు ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌ను ఎన్నుకుంటారు. అంద‌ల్‌కు 35 శాతం ఓట్లు పోలైన‌ట్లు సమాచారం. అయితే, రైతుల‌కు, బొగ్గు ప‌రిశ్ర‌మ‌కు ఎంతో సేవ చేయాల‌ని డేవిడ్ తపించిన‌ట్లు ఆయ‌న త‌ల్లి వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఇప్పుడు నార్త్ డ‌కోటాలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే