trump in more trouble చిక్కుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇక క్రిమినల్ కేసులతో విలవిల, న్యూయార్క్ అటార్నీ జనరల్ విచారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఆస్తుల తాలూకు కంపెనీ ఇక ఏ మాత్రం సివిల్ (సాధారణ నేర స్థాయి) సంస్థ కాదని , ఇది క్రిమినల్ పరిధిలోకి వస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ టాప్ ప్రాసిక్యూటర్ లెటిటా జేమ్స్ తెలిపారు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఆస్తుల తాలూకు కంపెనీ ఇక ఏ మాత్రం సివిల్ (సాధారణ నేర స్థాయి) సంస్థ కాదని , ఇది క్రిమినల్ పరిధిలోకి వస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ టాప్ ప్రాసిక్యూటర్ లెటిటా జేమ్స్ తెలిపారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టకముందు ఆయన సాగించిన పన్ను ఎగవేత, తన ఆస్తుల విలువను తక్కువగా చూపడం ద్వారా బ్యాంకులకి టోకరా, ఇన్సూరెన్స్ ఫ్రాడ్ వంటి నేరాల చిట్టాను విప్పుతున్నామని, వీటిపై విచారణ ప్రారంభమైందని జేమ్స్ చెప్పారు. నాటి ఆయన ఫైనాన్షియల్ డీలింగ్స్ తాలూకు రికార్డులను వెలికి తీసి పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఎప్పట్లాగే తానేమీ తప్పు చేయలేదని, డెమొక్రటిక్ ప్రాసిక్యూటర్ చేత ఇన్వెస్టిగేషన్ చేయించడం రాజకీయ కక్ష సాధింపేనని ట్రంప్ అంటున్నారు. ఇక మా దర్యాప్తు సివిల్ పరంగా ఉండబోదు.. క్రిమినల్ ధోరణిలో ఉంటుంది.. ఈ విషయాన్ని ఆయన నేతృత్వంలోని సంస్థకు కూడా తెలిపాం అని జేమ్స్ తరఫు అధికార ప్రతినిధి ఫెబిఎన్ లెవీ..బీబీసీకి తెలిపారు. 2019 మార్చి నెల నుంచే జేమ్స్..సివిల్ ఎంక్వయిరీ ప్రారంభించారు. ఆస్తులను తక్కువగా చూపి రుణాలు పొందేందుకు ట్రంప్ బ్యాంకులను ఎలా మోసగించిందీ, ఇన్సూరెన్స్ ఫ్రాడ్ తో బాటు 2016 లో తాను ఎఫైర్ పెట్టుకున్న ఇద్దరు మహిళలకు డబ్బు చెల్లింపులను కప్పిపుచ్చేందుకు ఫైనాన్షియల్ రికార్డులను ఎలా తారుమారు చేసిందీ అన్ని రికార్డులు తమవద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. .
మన్ హటన్, న్యూయార్క్, షికాగో, లాస్ఏంజిలిస్ లోని ఆస్తులకు సంబంధించిన కేసులతో బాటు మొత్తం ఆరు కేసులను ట్రంప్ ఎదుర్కోవలసి ఉంటుంది. ఆయన టాక్స్ రిటర్న్ లను తాము సంపాదించామని, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు వీటి గురించి సవివరంగా ప్రచురించాయని మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కూడా తెలిపారు.ఇందుకోసం తాము చాలాకాలంపాటు న్యాయపోరాటం చేసినట్టు సైరస్ వాన్స్ అనే ఈ అటార్నీ వెల్లడించారు. తన టాక్స్ రిటర్నుల వివరాలు తెలిపేందుకు ట్రంప్ ఎప్పుడూ నిరాకరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..