హింస ప్రతి సమస్యకూ పరిష్కారం కాదు, దీన్ని సమర్థించబోను, వీడ్కోలు సందేశంలో మెలనియా ట్రంప్, సమైక్యతే మేలని సూచన

హింస ప్రతిదానికీ సమాధానం కాదని, హింసను తను సమర్థించబోనని త్వరలో యూఎస్ మాజీ ఫస్ట్ లేడీ కానున్న మెలనియా ట్రంప్ అన్నారు..

  • Umakanth Rao
  • Publish Date - 12:09 pm, Tue, 19 January 21
హింస ప్రతి సమస్యకూ పరిష్కారం కాదు, దీన్ని సమర్థించబోను, వీడ్కోలు సందేశంలో మెలనియా ట్రంప్, సమైక్యతే మేలని సూచన

హింస ప్రతిదానికీ సమాధానం కాదని, హింసను తను సమర్థించబోనని త్వరలో యూఎస్ మాజీ ఫస్ట్ లేడీ కానున్న మెలనియా ట్రంప్ అన్నారు. మనం చేసే ప్రతి పనిలోనూ చిత్తశుద్ది ఉండాలని, కానీ హింస మాత్రందేనికీ పరిష్కారం కాదన్నారు. తన ఏడు నిముషాల వీడ్కోలు సందేశంలో ఆమె..అమెరికా ఫస్ట్ లేడీగా ఇన్నేళ్లూ ఇక్కడ ఉండడం తనకు ఎంతో సంతోషంగా ఉంటూ వచ్చిందన్నారు. ఇది తన జీవితంలో గొప్ప పురస్కారమని పేర్కొన్నారు. కరోనా వైరస్ పాండమిక్ అదుపునకు సైనికులు, అధికారులు, డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ సిబ్బంది, తల్లులు, చివరకు పిల్లలు కూడా ఎంతో కృషి చేశారని ఆమె ప్రశంసించారు. మనలను సమైక్యంగా ఏది ఉంచుతుందో దానిపై ఫోకస్ చేయాలని మెలనియా ట్రంప్ అమెరికన్లను కోరారు. అయితే ఈ నెల 6 న క్యాపిటల్  హిల్ లో జరిగిన అల్లర్లు, 5 గురి మృతి,….. ఈ ఉదంతంలో తన భర్త ట్రంప్ పాత్ర గురించి ఆమె ఈ మెసేజ్ లో ప్రస్తావించలేదు. క్యాపిటల్ హిల్ ఘటనలపై ఈమె నాడే స్పందించి ఉంటే మరోరకంగా ఉండేదని. కానీ ఈమె ఆ సాహసం చేయలేకపోయారని అంటున్నారు.

ఇక వైట్ హౌస్ ను వీడిన అనంతరం ఈమె ఫ్లోరిడా లో ఓ లైబ్రరీని నిర్వహించే యోచనలో ఉన్నారు. అలాగే ఇతర  కార్యక్రమాల్లోనూ మెలనియా పాల్గొనవచ్చ్చునని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

 

Also Read:

Cancer Crusader Dr Shanta Dead: వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేసి. రోగులకు సేవలను అందించిన డాక్టర్ శాంతి ఇక లేరు

Pakistan Approves Sinopharm: అత్యవసర పరిస్థితిల్లో వినియోగానికి చైనా వ్యాక్సిన్ కు అనుమతిలిచ్చిన పాకిస్థాన్

Leopard Fear: కామారెడ్డిలో చిరుత పులి హల్‌చల్.. రహదారిపై కారుకు అడ్డంగా రావడంతో…