క్యాపిటల్ హిల్ అల్లర్ల సందర్భంలో స్పీకర్ నాన్సీ పెలోసీ కార్యాలయం నుంచి ల్యాప్ టాప్ దొంగిలించిన మహిళ అరెస్టు.

క్యాపిటల్ హిల్ అల్లర్ల సందర్భంలో  స్పీకర్ నాన్సీ పెలోసీ కార్యాలయం నుంచి ల్యాప్ టాప్ దొంగిలించిన మహిళ అరెస్టు.

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో జరిగిన అల్లర్లు, ఘర్షణల సందర్భంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కార్యాలయం..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 12:38 PM

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో జరిగిన అల్లర్లు, ఘర్షణల సందర్భంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కార్యాలయం నుంచి ల్యాప్ టాప్ ను దొంగిలించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ముందుకు దూసుకువెళ్లాలని ట్రంప్ మద్దతుదారులను రెచ్ఛగొడుతూ  ఈమె…. ఇదే అదనని పెలోసీకి చెందిన కంప్యూటర్ ని చోరీ చేసింది. రిలే జూన్ విలియమ్స్ గా ఈమెను గుర్తించారు. పెన్సిల్వేనియాకు చెందిన  ఈమెను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కంప్యూటర్ ని విలియమ్స్ రష్యాలోని తన స్నేహితుడికి అమ్మాలని చూసిందని, అతగాడు దీన్ని రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ కి అప్పగించాలన్నది వీరి ప్లాన్ అని వారు చెప్పారు. కానీ ఈ ప్లాన్ తుస్సుమంది.

అయితే ఇంత చేసినా ఈమెపై పోలీసులు దొంగతనం ఆరోపణలను మోపలేదు. తాను దొంగిలించిన ల్యాప్ టాప్ అసలు ఈమె వద్ద ఉందో లేక దాన్ని నాశనం చేసిందో తెలియడంలేదని పోలీసులు అంటున్నారు. దీన్నొక సాధారణ చోరీగా వారు పరిగణించారు. ఏమైనా అత్యంత భద్రత గల హౌస్ స్పీకర్ కార్యాలయంలోనే ఎన్నో వివరాలు, రహస్యాలతో కూడిన కంప్యూటర్ చోరీకి గురయితే ఫెడరల్ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. విలియమ్స్ మాత్రం తన నేరంపై నోరెత్తితే ఒట్టు..

Also Read:

Political Challenge: వైసీపీ మేనిఫేస్టో నేను తెస్తా, టీడీపీ మేనిఫెస్టో నువ్వు తీసుకురా.. చర్చకు సిద్ధం అంటూ దేవినేనికి మంత్రి కొడాలి సవాల్..

Sonu sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్‌… హైదరాబాద్‌లో కొత్త సేవ ప్రారంభించిన రియల్‌ హీరో..

హింస ప్రతి సమస్యకూ పరిష్కారం కాదు, దీన్ని సమర్థించబోను, వీడ్కోలు సందేశంలో మెలనియా ట్రంప్, సమైక్యతే మేలని సూచన

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu