Joe Biden : అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సర్వంసిద్ధం .. 46వ ప్రెసిడెంట్‌గా జో బైడెన్
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. బుధవారం అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా..

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. బుధవారం అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన కమలా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనం ముట్టడి తర్వాత జరుగుతున్న ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20 బుధవారం రాత్రి 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమెరికా జాతీయగీతంలో ఆరంభమవుతుంది. యూఎస్ఏ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి ముందు కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :