అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు

వైట్‌హస్‌లో లాంఛనంగా వీడ్కోలు అందుకున్న తర్వాత నేరుగా ఫ్లోరిడా వెళ్లిపోనున్నాను. ..

  • Sanjay Kasula
  • Publish Date - 12:40 am, Wed, 20 January 21
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు

Donald Trump : జో బైడెన్‌ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసే జనవరి 20 ఉదయమే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌ వదిలివెళ్లనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య ఆయనకు గన్‌ సల్యూట్‌ తో లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు.. మేరీలాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో ట్రంప్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమం జరుగనుంది.

అయితే నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనని ఇప్పటికే ప్రకటించారు ట్రంప్‌.. అధికార విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో నేరుగా ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌ వెళ్లనున్నారాయన.. అమెరికా ప్రథమ మహిళగా మరి కొద్ది గంటలు మాత్రే కొనసాగే మెలానియా ట్రంప్‌.. సంప్రదాయాన్ని అనుసరించి దేశ ప్రజలకు వీడ్కోలు సందేశాన్ని ఇచ్చారు. అమెరికా ప్రథమ మహిళగా ఉండటం తనకు జీవితంలో లభించిన అతి గొప్ప గౌరమన్నారామె. . కరోనా కాలంలో అమూల్య సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బందితో సహా.. సైనికులు, న్యాయాధికారులు, చిన్నారులు, మాతృమూర్తులు అందరికీ తన హృదయంలో సముచిత స్థానముందని మెలానియా వెల్లడించారు.

అన్ని పరిస్థితుల్లో మంచికి మారుపేరులా ఉండాలని ప్రతి అమెరికన్‌ను కోరుతున్నానని, మనల్ని ఏకం చేసే అంశంపై దృష్టిపెట్టాలని సూచించారు. విభజించే అంశాలకు అతీతంగా ఉండండి. విద్వేషానికన్నా ప్రేమను ఎంచుకోండి. హింసకన్నా శాంతిని ఎంచుకోండి.

మీకన్నా ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వండి అంటూ ఏడు నిమిషాల పాటు కొనసాగిన వీడియోలో సూచించారు మెలానియా.. కాగా ప్రథమ మహిళగా ఉండే చివరి రోజుల్లో మెలానియా శ్వేతసౌధానికి దూరంగానే ఉంటున్నారు. తన భర్త ట్రంప్‌ పదవీకాలం ముగియటంపై ఆమెకు అంత విచారకరంగా ఉన్నట్లు కనిపించటం లేదని పరిశీలకులు చెవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Sania Mirza Corona Positive : సోనియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్
Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..