అమెరికా రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌కు జరిపిన డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే బెయిల్ కోసం మాన్‌హట్టన్ కోర్టులో ట్రంప్ వాదనలు వినిపిస్తున్నారు.. త్వరలోనే ట్రంప్‌కు బెయిల్ వస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే షరతులు విధించే అవకాశం ఉందంటున్నారు.కాగా 2006లో డొనాల్డ్ ట్రంప్.. తాను ఓ ఈవెంట్‌లో కలుసుకున్నామనీ.. ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్నిరహస్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ట్రంప్‌పై ప్రధాన ఆరోపణ. అయితే, ఇది నిజమేనని ఒప్పుకుంటూ కోహెన్ట్రంప్ పరువును బజారుకీడ్చాడు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఇక ఈ కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు గత మంగళవారం డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.
మరోవైపు ఈ కేసులో తానే తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తన పోటీని నిలువరించేందుకు జరుగుతున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. డబ్బు గుంజేందుకు పోర్న్ స్టార్ ఆడుతున్న నాటకంగా దీన్నిట్రంప్ తరపు న్యాయవాదులు అందిస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి అగ్రరాజ్యాధిపతి ఇలాంటి కేసుల్లో కటాకటాల్లోకి వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Breaking News: Donald Trump is now under arrest in New York City and is set to face arraignment in NYC.#BreakingNews #TrumpArraignment #TrumpArrest #Trump #ABCNewsGh pic.twitter.com/xeD5edAxPu
— ABC News GH (@ABCNewsGH_) April 4, 2023