ట్రంపా.. మజాకానా.. ఫోన్‌‌లో ఫీచర్ లేదంటూ చిర్రెత్తి.. యాపిల్ సీఈవోకే ట్వీట్..!

మన ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌ నచ్చక పోతే ఏం చేస్తాం.. ఇంకో ఫోన్ కొనుక్కుంటాం. ఒకవేళ ఎక్కువ ధర మొబైల్ అయితే.. కొనేప్పుడు ఫీచర్స్ చూస్తే అయిపోయేదని బాధపడతాం. ఒకవేళ కంపెనీ ఫీడ్‌ బ్యాక్ అడిగితే.. ఏదో కామెంట్స్ పెట్టి వదిలేస్తాం. అంతేకాని.. మనం వాడే ఫోన్ నచ్చలేదు అని కంపెనీకి కంప్లైంట్ అయితే చేయ్యం దాదాపుగా.. కానీ పెద్ద సంస్థకు చెందిన ఫోన్‌ను ధర ఎక్కువ పెట్టి కొంటే..? అప్పుడు ఆ ఫోన్‌లో అనుకూలంగా ఫీచర్స్ […]

ట్రంపా.. మజాకానా.. ఫోన్‌‌లో ఫీచర్ లేదంటూ చిర్రెత్తి.. యాపిల్ సీఈవోకే ట్వీట్..!
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2019 | 6:33 AM

మన ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌ నచ్చక పోతే ఏం చేస్తాం.. ఇంకో ఫోన్ కొనుక్కుంటాం. ఒకవేళ ఎక్కువ ధర మొబైల్ అయితే.. కొనేప్పుడు ఫీచర్స్ చూస్తే అయిపోయేదని బాధపడతాం. ఒకవేళ కంపెనీ ఫీడ్‌ బ్యాక్ అడిగితే.. ఏదో కామెంట్స్ పెట్టి వదిలేస్తాం. అంతేకాని.. మనం వాడే ఫోన్ నచ్చలేదు అని కంపెనీకి కంప్లైంట్ అయితే చేయ్యం దాదాపుగా.. కానీ పెద్ద సంస్థకు చెందిన ఫోన్‌ను ధర ఎక్కువ పెట్టి కొంటే..? అప్పుడు ఆ ఫోన్‌లో అనుకూలంగా ఫీచర్స్ లేకపోతే..? ఏం చేస్తాం.. రీప్లేస్‌మెంట్ అవకాశం కోసం కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తాం. కానీ కంపెనీ సీఈవోకి మీ ఫోన్‌లో ఫీచర్స్ బాగులేవంటూ అయితే చెప్పలేం కదా..? కానీ అగ్రరాజ్య అధినేత మాత్రం తన ఫోన్‌లో ఫీచర్స్‌ తనకు అనుకూలంగా లేవంటూ.. ఆ కంపెనీ సీఈవోకే డైరక్ట్‌గా ట్వీట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ విడుదల చేసిన కొత్త డిజైన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం అందులో తనకు అందుబాటుగా ఫీచర్స్ లేకపోవడం. గతంలో ఆయన వాడిన పాత డిజైన్‌లో ఉండే హోం బటన్‌ స్థానాన్ని యాపిల్ సంస్థ కాస్త అప్‌గ్రేడ్ చేసింది. అయితే ఈ మార్పులతో ట్రంప్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాత హోం బటన్ స్థానమే బాగుండేదని, ప్రస్తుతం స్వైప్ కొంచెం ఇబ్బందిగా ఉందంటూ.. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు ట్వీట్ చేశారు.

కొత్త మోడల్‌ను ఉపయోగించడంలో తనకు ఎదురవుతున్నఇబ్బందిని పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ఆగ్రహానికి వేరే కారణం ఏమైనా ఉండొచ్చా అన్నది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఐఫోన్ 10 మోడల్‌లో యాపిల్ సంస్థ చిన్న మార్పులు చేసింది. కొత్త మోడళ్లలో హోం బటన్‌ను తొలగించి అప్‌గ్రేడ్ చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 మ్యాక్స్ ప్రో ఫోన్లలోనూ హోం బటన్లు తీసేసింది. అయితే ప్రభుత్వం అందించే ఐఫోన్‌నే ట్రంప్ వాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోన్ పాత మోడల్ కావడంతో.. ప్రభుత్వం దానిని అప్‌గ్రేడ్ చేసి కొత్త మోడల్‌ను ట్రంప్‌ చేతిలో పెట్టింది. కొత్త ఫోన్ మోడల్‌లో హోం బటన్ లేకపోయే సరికి ట్రంప్‌కు మండిపోయింది. కొత్త ఫోన్లలో హోం స్క్రీన్‌కు రావాలంటే ప్రతిసారీ స్క్రీన్‌ను స్వైప్ చేసుకోవాల్సి వస్తోందంటూ.. టిమ్‌కుక్‌కు ట్వీట్ చేశారు. హోం బటన్ ఉన్నప్పుడే ఐఫోన్ వాడడం సులభంగా ఉండేదని అందులో పేర్కొన్నారు.

కాగా, ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆయన గతంలో యాపిల్‌ను ఉద్దేశించి గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యాపిల్ కూడా శాంసంగ్‌లా పెద్దపెద్ద స్క్రీన్లు ఉన్న ఫోన్లు విడుదల చేయాలని, అందులో హోం బటన్‌ను తొలగించాలంటూ గతంలో ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడేమో మళ్లీ ఆయనే అందుకు విరుద్ధంగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో