Corona 4th Dose: ఇక నాలుగో డోస్ వంతు వచ్చేసింది.. అమెరికా డాక్టర్ ఆంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు..

|

Feb 11, 2022 | 6:30 PM

Corona 4th Dose in America: ఫస్ట్ డోస్.. రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినా ఆగలేదు. ముచ్చటగా మూడోసారి బూస్టర్ డోస్ కు కూడా అదుపులోకి రాలేదు. దాంతో ఈ మాయదారి కరోనా..

Corona 4th Dose: ఇక నాలుగో డోస్ వంతు వచ్చేసింది.. అమెరికా డాక్టర్ ఆంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు..
Follow us on

Corona 4th Dose in America: ఫస్ట్ డోస్.. రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినా ఆగలేదు. ముచ్చటగా మూడోసారి బూస్టర్ డోస్ కు కూడా అదుపులోకి రాలేదు. దాంతో ఈ మాయదారి కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో డోస్ రూపంలో మరోసారి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

మెరుగైన వైద్య చికిత్సలో అగ్రగామి అయిన అమెరికాను సైతం గడగడలాడించిన కరోనా. కరోనా కారణంగా అమెరికా కకావికలం అయ్యింది. రకరకాల రూపాలు మార్చుకున్న కోవిడ్.. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ లు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు తీవ్రంగా నష్టం మిగిల్చాయి. మహమ్మారి భారిన పడి యూఎస్ లో లక్ష మందికి పైగా ప్రజలు మృతిచెందారు. ఫస్ట్ డోస్.. సెకండ్ డోస్.. ముచ్చటగా మూడోసారి వేసిన బూస్టర్ డోస్ కు కూడా కోవిడ్ అదుపులోకి రాలేదు. దాంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగవ డోస్ రూపంలో మరోసారి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రెడీ అయింది.

ఈ క్రమంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో అమెరికా పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని చెప్పారు ఫౌచీ. ప్రజ‌ల వ్యక్తిగ‌త వ‌య‌స్సు, ఆరోగ్య స‌మ‌స్యల ఆధారంగా నాలుగో డోసు వేయాల్సి ఉంటుందన్నారాయన. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు. నవంబర్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందడాన్ని ఒమిక్రాన్ దశగా అభివర్ణించారు ఫౌచీ. ఇదిలా ఉంటే.. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ తోపాటు మరికొన్ని రాష్ట్రాలు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, పాఠశాలల్లో మాస్క్ వినియోగాన్ని కొనసాగించాలన్న సీడీసీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది అమెరికా ప్రభుత్వం. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పౌరులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీడీసీ సూచించింది.

Also read:

Promise Day 2022: ఈ ప్రామిస్‌లు చేశారంటే మీ బంధం ఎక్కువ రోజులు నిలువదు! వీటితో జాగ్రత్త..

Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..

TS Polytechnic: పాలిటెక్నిక్‌ ప్రశ్నాపత్రాల లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌.. పరీక్షలను రద్దు చేస్తూ..