అమెరికా ఉపాధ్యక్షుని సభలో ఇద్దరు కరోనా బాధితులు.. ఫ్లోరిడాలో ఇద్దరి మృతి

అమెరికాను కరోనా మెల్లగా వణికిస్తోంది. ఈ వ్యాధికి గురై తాజాగా  ఫ్లోరిడాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో  ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 మందికి పెరగగా.. 330 కేసులు నమోదయ్యాయి.

అమెరికా ఉపాధ్యక్షుని సభలో ఇద్దరు కరోనా బాధితులు.. ఫ్లోరిడాలో ఇద్దరి మృతి
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2020 | 12:20 PM

అమెరికాను కరోనా మెల్లగా వణికిస్తోంది. ఈ వ్యాధికి గురై తాజాగా  ఫ్లోరిడాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో  ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 మందికి పెరగగా.. 330 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిన్న అత్యవసరంగా 8.3 బిలియన్ డాలర్ల వ్యయానికి ఉద్దేశించిన ప్యాకేజీపై సంతకం చేశారు. అటు -న్యూయార్క్ సిటీలో కొత్తగా 22 కేసులు నమోదు కాగా..మొత్తం ఈ సంఖ్య 44 కి పెరిగింది. మరోవైపు- ఇజ్రాయెల్ అనుకూల లాబీ వాషింగ్టన్ లో నిర్వహించిన  సభకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర ఎంపీలు హాజరయ్యారు. న్యూయార్క్ లో కరోనాకు గురైన ఓ జంట కూడా ఈ కాన్ఫరెన్స్ కు వఛ్చినట్టు తెలియడంతో అంతా ‘అలర్ట్’ అయ్యారు. టెస్టుల్లో ఈ జంటకు కరోనా వైరస్ లక్షణాలు పాజిటివ్ అని వెల్లడైందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ.. ఈ-మెయిల్ ద్వారా ఈ సభకు హాజరైనవారందరికీ తెలిపింది. పైగా ఈ విషయాన్ని ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది కూడా..

న్యూయార్క్ లోని వెస్ట్ చెస్టర్  కౌంటీ ఆరోగ్య శాఖ విభాగంతో తాము టచ్ లో ఉన్నామని, ఈ జంటకు సోకిన కరోనాను ఆ శాఖ అధికారులు కూడా ధృవీకరించారని ఈ కమిటీ పేర్కొంది. అమెరికాలో కరోనా నియంత్రణ బాధ్యతను అధ్యక్షుడు ట్రంప్.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో పెన్స్..వివిధ దేశాల ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనాకు గురై మృతి చెందినవారి సంఖ్య 3,450 కి పెరగగా.. 92 దేశాల్లో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య కూడా లక్షకు పెరిగింది.