సెల్ఫీ మోజు

ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది. జాగ్వర్ దాడిలో ఆమె భుజానికి బలమైన గాయమైంది. ఈ సమాచారం అందగానే జూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి […]

సెల్ఫీ మోజు
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 7:20 PM

ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది.

జాగ్వర్ దాడిలో ఆమె భుజానికి బలమైన గాయమైంది. ఈ సమాచారం అందగానే జూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు జూలోని సీసీటీవీ కెమేరా ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు.