Zombie Virus Attack: అమెరికాలో జోంబీ వైరస్‌ కలకలం.. ఆ సినిమా ఏ క్షణాన తీశారోగానీ నిజంగానే..

|

Feb 23, 2023 | 6:10 PM

అమెరికా నగర వీధుల్లో కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. నిలబడలేక, నడవలేక వింతగా ప్రవర్తిస్తున్న..

Zombie Virus Attack: అమెరికాలో జోంబీ వైరస్‌ కలకలం.. ఆ సినిమా ఏ క్షణాన తీశారోగానీ నిజంగానే..
Zombie Virus In Americ
Follow us on

2016లో విడుదలైన సౌత్ కొరియన్ యాక్షన్ హారర్ మువీ ‘రెయిన్ టు బుసాన్’ ఏ క్షణాన విడుదలైందో గానీ అప్పటి నుంచి యావత్‌ ప్రపంచం తెలియని భయంతో ఉలిక్కిపడుతోంది. అది కేవలం కల్పిత కథా చిత్రమైనప్పటికీ ఏదో తెలియని భయం వెంటాడుతోంది. గతేడాది అమెరికా నగర వీధుల్లో కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. నిలబడలేక, నడవలేక వింతగా ప్రవర్తిస్తున్న మనుషుల్ని చూసి కొంపతీసి జోంబీ వైరస్‌ కాదుకదా అనే సందేహం ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత ఆస్తవం తెలిసి నాలుక కరచుకుంది. నిజానికి వారంతా డ్రగ్స్‌ మత్తులో అలా ప్రవర్తించారని మొత్తానికి అమెరికా గుర్తించింది. ‘ట్రాంక్’, ‘ట్రాంక్ డోప్’, ‘జోంబీ డ్రగ్’ అనే పేర్లతో పిలిచే Xylazine అనే మాదక ద్రవ్యాల లక్షణాలు కొంత వింతగా ఉంటాయట. అధికంగా నిద్రపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై గాయాలు ఏర్పడి చర్మం ఊడిపోవడం.. వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖ్యంగా చర్మంపై చిన్న అన్సర్‌లా ప్రారంభించి అనతికాలంలోనే డెడ్ స్కిన్‌ (ఎస్చార్) బారీన పడతారు. సకాలంలో చికిత్సనందించకపోతే చర్మం శరీర భాగాలు ఊడిపోతాయి.’జోంబీ డ్రగ్’ అధిక మోతాదులో తీసుకుంటే కోలుకోవడం దాదాపు అసాధ్యం. సాధారణంగా డ్రగ్స్‌ ఓవర్ డోస్ తీసుకున్నవారు ఇచ్చే నలోక్సోన్/నార్కాన్ వంటి చికిత్సలకు సైతం వీరు స్పందించరు. క్రమంగా ప్రాణాలు కూడా హరించుకుపోతాయి. జిలాజైన్ డ్రగ్‌ కేసులు తొలుత ఫిలడెల్ఫియాలో బయటపడ్డాయి. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్‌లలో వెలుగుచూశాయి.

అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెటర్నరీ విభాగం జిలాజైన్ డ్రగ్‌ను వినియోగిస్తుంటారు. ఐతే ఇది మానవులకు ప్రాణాంతకమైనది. అమెరికాలో డ్రగ్స్‌ మాఫియాల ద్వారా ఈ డ్రగ్‌ సామాన్యుల చేతిలోకి చేరుతున్నట్లు, ఓవర్‌ డోస్‌ తీసుకోవడం వల్ల మరణాలు సైతం సంభవిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ వార్తాకథనాలు పేర్కొన్నాయి. న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. 2021లో ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 2,668 మంది ఓవర్ డోస్‌తో మృతి చెందినట్లు వెల్లడించింది. అమెరికా మొత్తం మీద జిలాజైన్ డ్రగ్‌ వల్ల 2021లో 1,07,000కుపైగా మరణాలు సంభవించినట్లు తెల్పింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుంటే పెనుప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.