హై అలర్ట్.. గల్ఫ్ అండర్‌ అటాక్‌..! థర్డ్‌ వరల్డ్ వార్‌కి దారితీస్తుందా? గ్లోబల్ ముప్పు తప్పదా?

ఏ దేశంలోనైనా యుద్ధం మొదలై రెండు మూడు రోజులు జరిగితే చాలు.. వెంటనే నాగసాకి, హిరోషినా నాటి వినాశకాలే గుర్తుకొస్తాయి. పెద్ద దేశాల చేతుల్లో ఉండే అణ్వాయుధాల లెక్కలే చర్చకు వస్తాయి. దేశాధినేతలకు సహజంగా ఉండే అహంభానాలే టాపిక్‌ అవుతాయి. ఇప్పుడూ అంతే, మిడిల్ ఈస్ట్ మంటల క్లైమాక్స్ ఏంటి, మూడో ప్రపంచ యుద్ధమేనా? అని సీరియస్‌గా డిబేట్లు షరూ అయ్యాయి. మరి, ఇవన్నీ యూట్యూబ్ థంబ్‌ నెయిల్స్ కోసం పనికొచ్చేవేనా.. లేక నిజంగానే న్యూక్లియర్ వార్ కమింగ్‌ సూన్ అనుకోవచ్చా? చర్చ మొదలైంది.

హై అలర్ట్.. గల్ఫ్ అండర్‌ అటాక్‌..! థర్డ్‌ వరల్డ్ వార్‌కి దారితీస్తుందా? గ్లోబల్ ముప్పు తప్పదా?
Nuclear Fear World War Iii

Updated on: Mar 04, 2026 | 9:53 PM

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేశాం, ఇక ఇరాన్‌ను ఆక్రమిస్తామని వాళ్లు, నెతన్యాహును రౌండప్ చేశాం, గల్ఫ్ మొత్తాన్ని తగలబెట్టేస్తామని వీళ్లు.. చెరో వైపు లాగుతుంటే ప్రపంచం రెండుగా తెగిపోతోందా అనే భయం. పైగా, ఇరాన్‌పై యుద్ధం ముస్లింలపై యుద్ధమన్న ప్రచారం మరింత ప్రమాదకరంగా మారింది. దేశాధినేతలు పోటీపడి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ.. రక్తచరిత్రలు రాసుకుంటున్నారు. మతమౌఢ్యం మితిమీరి ముస్లిం, నాన్‌ ముస్లిం కంట్రీస్ రెండు జట్లుగా విడిపోతే.. గ్లోబు మొత్తానికీ ముప్పు తప్పదా? తెగేదాకా లాగితే.. టగ్‌ఆఫ్ వార్.. థర్డ్‌ వాల్డ్ వార్‌కి దారితీస్తుందా? మిడిల్ ఈస్ట్‌లో యుద్ధజ్వాల పుట్టి ఐదు రోజులైంది. ఇరాన్‌లో 2 వేల లక్ష్యాలను దెబ్బతీసింది అమెరికా. ఖమేనీ వారసుడిగా కొత్త కిరీటం తొడుక్కోబోతున్న ఖమేనీ రెండో కొడుకు మొజ్తబాను కూడా లేపేస్తాం అంటోంది ఇజ్రాయెల్. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్.. పక్కనున్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడి సౌదీలోని CIA స్టేషన్‌ను, ఖతార్‌లోని US బేస్‌ని నేలమట్టం చేసింది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా మెరుపుదాడులు చేస్తోంది. ఒక్క సౌదీలోనే వెయ్యికిపైగా దాడులు చేసింది ఇరాన్. మిగతా గల్ఫ్‌ దేశాలకంటే ఇదే హయ్యస్ట్. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. జనం ఇల్లు దాటి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి