World Hypertension Day 2022: దేశంలో అధిక రక్తపోటు కేసులు పురుషులలో ఎక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5 ) ఇటీవలి నివేదిక ప్రకారం.. దేశంలో 24 శాతం మంది పురుషులు రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే సమయంలో ఈ సంఖ్య మహిళల్లో 21 శాతంగా ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే దేశంలోని 67 శాతం మంది మహిళలు, 53.7 మంది పురుషులు తమ రక్తపోటును ఎప్పుడూ పరీక్షించుకోలేద తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ప్రకారం.. 2015లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 113 మిలియన్ల మంది ప్రజలు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2025 నాటికి ప్రపంచ జనాభాలో 29 శాతం మంది దీని బారిన పడతారని అంచనా. మే 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే. అధిక రక్తపోటు వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి. మరి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
WHO నివేదిక ప్రకారం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్ల మంది ప్రజలు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. 2019లో 1.79 కోట్ల మంది గుండె జబ్బులతో మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి. చాలా మందికి వారి రక్తపోటు ఎంత ఎక్కువగా ఉందో అర్థం కావడం లేదు. అందుకే ఇది ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, ముక్కు నుంచి రక్తం కారడం, కంటి చూపు కోల్పోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి.
హెచ్చరించే హైపర్‌టెన్షన్ లక్షణాలు:
☛ మూర్ఛ అనుభూతి
☛ ఆకస్మిక అస్పష్టమైన దృష్టి
☛ వాంతులు
☛ తల, ఛాతీ నొప్పి
☛ శ్వాస ఆడకపోవుట
☛ కళ్ళలో ఎర్రటి మచ్చ
రక్తపోటు సమస్య ఎందుకు వస్తుంది?
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. అధిక రక్తపోటు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు పెరగడం, ఊబకాయం, ఆల్కహాల్ తీసుకోవడం, శరీరం చురుకుగా ఉండకపోవడం, మధుమేహం, శరీరంలో సోడియం స్థాయి పెరగడం వంటివి. ఇది కాకుండా కుటుంబంలోని ఎవరికైనా అధిక రక్తపోటు సమస్య ఉంటే అది కొత్త వారి తరంలో ఉన్నవారికి వ్యాపించవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు అధిక రక్తపోటు కోసం తనిఖీ చేయండి. పరీక్షలో సాధారణ స్థాయి రక్తపోటు 120/80 ఉండాలి.
రక్తపోటును ఎలా నియంత్రించాలి..?