World Brain Tumor Day 2022: బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి..? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. చికిత్స విధానం ఏంటి?

| Edited By: Ravi Kiran

Jun 08, 2022 | 7:39 AM

World Brain Tumor Day 2022: ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే 2022 ప్రతి సంవత్సరం జూన్ 8 న జరుపుకుంటారు . ఈ రోజును జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం..

World Brain Tumor Day 2022: బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి..? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. చికిత్స విధానం ఏంటి?
Brain Health
Follow us on

World Brain Tumor Day 2022: ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే 2022 ప్రతి సంవత్సరం జూన్ 8 న జరుపుకుంటారు . ఈ రోజును జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం. ఈ వ్యాధి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో ఈ వ్యాధి లక్షణాలు, దాని గురించి అనేక ముఖ్యమైన సమాచారం ఇవ్వబడింది. తద్వారా వ్యాధి పురోగతిని నిరోధించవచ్చు. ప్రజలు తమను తాము రక్షించుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధిలో మెదడులో కణాలు, కణజాలాల గడ్డలు ఏర్పడతాయి. దీనినే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం తప్పదు. బ్రెయిన్ ట్యూమర్ డే రోజున దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వాటిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తారు.

ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే చరిత్ర

ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేను ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ జర్మనీలో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. బ్రెయిన్ ట్యూమర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సంస్థ ఉద్దేశం. తద్వారా ప్రజలు ఈ వ్యాధి గురించి తెలుసుకొని సకాలంలో చికిత్స చేయగలుగుతారు.

ఇవి కూడా చదవండి

వ్యాధి లక్షణాలు:

☛ తరచుగా తలనొప్పి

☛ వాంతులు, వికారం

☛ విపరీతమైన అలసట, బద్ధకం

☛ వినికిడి లోపం

☛ నిద్రకు ఇబ్బంది

☛ స్వల్పకాలిక జ్ఞాపకశక్తి నష్టం

☛ దూరదృష్టి

☛ మసక దృష్టి

☛ నడుస్తున్నప్పుడు తడబడుట

☛ జ్ఞాపకశక్తి కోల్పోవడం

☛ కండరాల తిమ్మిరి

ఈ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఒక నివేదిక ప్రకారం.. వ్యాధి, డ్రగ్స్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొవచ్చు. ఈ లక్షణాలు ఉంటే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. తరచుగా ప్రజలు ఈ లక్షణాలను విస్మరిస్తారు. ఇది మున్ముందు తీవ్ర సమస్యగా మారుతుంది. ఈ వ్యాధి చికిత్స చాలా ముఖ్యం. దీనికి అనేక రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్స వంటివి ఉన్నాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి