గర్భాశయం లేకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి……అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స

| Edited By: Anil kumar poka

Jun 23, 2021 | 1:05 PM

గర్భాశయం లేకుండానే పండంటి అడ పిల్లకు జన్మనిచ్చింది ఓ మహిళ...వైద్య శాస్త్ర చరిత్రలో ఇది అరుదైన విషయమంటున్నారు. అమందా గ్రూనెల్ అనే ఈ మహిళ ఉదంతంలోకి వెళ్తే.. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్స్ ప్రాంత సమీపంలో నివసించే ఈమెకు...

గర్భాశయం లేకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి......అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స
Woman Without Uterus Gave Birth To Healthy Baby Girl
Follow us on

గర్భాశయం లేకుండానే పండంటి అడ పిల్లకు జన్మనిచ్చింది ఓ మహిళ…వైద్య శాస్త్ర చరిత్రలో ఇది అరుదైన విషయమంటున్నారు. అమందా గ్రూనెల్ అనే ఈ మహిళ ఉదంతంలోకి వెళ్తే.. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్స్ ప్రాంత సమీపంలో నివసించే ఈమెకు 16 ఏళ్ళ వయస్సులోనే పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్లను సంప్రదించింది. అయితే నీకు గర్భాశయం (యూటిరస్) లేదని, పెళ్లి చేసుకున్నా నీకు పిల్లలు పుట్టరని వారు స్పష్టం చేశారట. పైగా యూటిరస్ మార్పిడికి కూడా అవకాశం లేదని చెప్పారట.. కాగా పెళ్లి అయ్యాక తన 32 ఏళ్ళ వయస్సులో ఎలాగైనా తను ఓ బిడ్డకు తల్లిని కావాలనుకుంది అమందా…..క్లీవ్ ల్యాండ్ క్లినిక్ లో యూటిరస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రయల్ ప్రోగ్రామ్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళింది. తాను కూడా ఈ పరీక్ష చేయించుకుంటానని అనడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు కూడా సరేనంటూ ఆమెకు సహకరించారు, చివరకు మరణించిన ఓ డోనర్ నుంచి గర్భాశయాన్ని డాక్టర్లు ఆమెకు ఐవీఎఫ్ ద్వారా ఆపరేషన్ చేసి అమర్చారు. ఈ శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యింది.

గత మార్చి నెలలో అమందా ఆరోగ్యవంతురాలైన చిన్నారికి జన్మనిచ్చింది. ఆరు పౌండ్ల 11 ఔన్సుల బరువున్న ఆ పసికందుకు ఆమె తన తల్లి సూచించిన పేరునే పెట్టుకుంది. ఇప్పుడు అమందా ఆనందానికి అవధుల్లేవు. పిల్లలే పుట్టారనుకున్న తాను తల్లి అయింది. తనకు యూటిరస్ మార్పిడి చేసిన డాక్టర్లను ఎంతగానో పొగుడుతోంది. అమెరికాలో ఈ విధమైన ఆపరేషన్ జరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈమె కుటుంబం సంతోషానికి కూడా అంతే లేకపోయింది.