ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా మంది అతిక్రమిస్తుంటారు. అందుకు జరిమానాలు, శిక్షలు కూడా అనుభవిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 414 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ మహిళకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధించారు. అయితే ఇది మన దేశంలో అనుకుంటే పొరపాటే. దుబాయ్‌లో. ఇలా వందలకొద్ది ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్న ఆమెను ఇటీవల అజ్మాన్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె కారుపై వందలాది ఉల్లంఘనలు ఉన్నా.. మూడు సంవత్సరాలుగా ఆమె పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం గమనార్హం. దీంతో ఈ ఉల్లంఘనలకు గాను సదరు మహిళకు రూ.2.47 లక్షల దిర్హమ్స్ (భారత కరెన్సీలో సుమారు 48.78 లక్షలు రూపాయలు) జరిమానా విధించారు పోలీసులు. మూడేళ్లలో 414 ఉల్లంఘనలు అంటే.. వారానికి నాలుగు చొప్పున ఆమె ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడించారు. ఒకవేళ సదరు మహిళ ఈ మొత్తాన్ని చెల్లించకపోతే ఆమె కారునువేలం వేస్తామని పోలీసులు తెలిపారు.
ఇక పౌరులు పాల్పడుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలలో అతివేగం మొదటి స్థానంలో అజ్మాన్ పోలీసు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ విభాగంలో ట్రాఫిక్ ఇన్వేస్టిగేషన్ అండ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ చీఫ్ మేజర్ రషీద్ హమీద్ బిన్ హిందీ తెలిపారు. అయితే అతివేగంగా ప్రయాణించకూడదనే నిబంధనలు ఉన్న ప్రాంతాల్లో 80 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణిస్తే 3వేల దిర్హమ్స్ జరిమానా, 23 బ్లాక్ పాయింట్లతో పాటు 60 రోజుల పాటు వాహనం సీజ్ చేస్తామని రషీద్ పేర్కొన్నారు. అలాగే 60 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణిస్తే 2 వేల రిర్హమ్స్ జరిమానా ఉంటుందని, అలాగే 12 బ్లాక్ పాయింట్స్‌తో పాటు 30 రోజుల పాటు వాహనం సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, ఇక మనదేశంలో అయితే ఎన్నిసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని తెలిపి.. చెడ చెవిన పెడుతుంటారు. మన దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు చేపడుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉప్పటికే హెల్మెట్ లేకున్నా, లైసెన్స్ లేకున్నా, ఇతర ఎలాంటి పత్రాలు లేకున్నా భారీగానే జరిమానాలు విధిస్తున్నారు. ఇక డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్షలు సైతం విధిస్తున్నారు. అయినా కొందరు తీరు మార్చుకోకపోవడంతో చిక్కుల్లో పడిపోతున్నారు.
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు