ఇద్దరు చిన్న పిల్లల మృత దేహాలతో అమెరికాలో ఓ మహిళ కొన్ని నెలల పాటు కారులో తిరిగింది. ఈ పిల్లలిద్దరూ ఎవరో కాదు.. ఈమె సోదరి పిల్లలేనని తెలిసింది. ముక్కు పచ్చలారని ఏడేళ్ల బాలిక, అయిదేళ్ల బాలుని డెడ్ బాడీలతో ఈమె తన కారులో తిరిగిన వింత ఘటన పోలీసులనే ఆశ్చర్యపరిచింది. 33 ఏళ్ళ ఈ మహిళ పేరు నికోల్ జాన్సన్..బాల్టిమోర్ కు చెందిన ఈమె గత బుధవారం అత్యంత వేగంగా కారులో వెళ్తుండగా… పోలీసులు ఆపారు. అనుమానంపై కారులో సోదా చేయగా.. ఈ పిల్లల డెడ్ బాడీలున్న సూట్ కేసు, ట్రంక్ బయటపడ్డాయి.ప్లాస్టిక్ బ్యాగులో వీటిని అమె చుట్టి ఉంచిందని పోలీసులు తెలిపారు. 2019 మే నుంచి ఈమె ఇలా తన వాహనంలో తిరుగుతోందట. ఈమె వద్ద తన కారుకు సంబంధించిన పత్రాలు కూడా లేవని [పోలీసులు తెలిపారు. నీ కారును నాశనం చేస్తామని, నీ మీద కేసు పెడతామని చెప్పినప్పుడు ఆమె.. మరేం ఫరవాలేదని, మరో 5 రోజుల తరువాత తానిక్కడ ఉండనని చెప్పిందట.. మీరేమైనా చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్టు వారు పేర్కొన్నారు.
ఈమెపై వారు పలు కేసులు పెట్టి కోర్టుకు తరలించారు.నిజానికి తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకోవాలని నికోల్ సోదరి వారిని ఈమెకు అప్పగించగా.. ఆ మేనత్త ఇలా ఆ బాలల పాలిట రాక్షసిగా మారింది. వారిని దారుణంగా హతమార్చింది. పైగా వారి డెడ్ బాడీలను తన కారులో ఉంచి ఇన్ని నెలలుగా తిరగడం చాలా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. బహుశా ఈమె మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..
Healthy Foods: జీర్ణవ్యవస్థ బాగుండాలంటే ఇవి తప్పక తినాల్సిందే.. అవి ఏవేవో తెలుసుకోండి!