US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు..

|

Mar 25, 2023 | 5:10 AM

US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో అరుదైన వాతావరణ పరిస్థితులేర్పడ్డాయి. లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో భీభత్సం సృష్టించింది.

US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు..
Us Tornado
Follow us on

అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో అరుదైన వాతావరణ పరిస్థితులేర్పడ్డాయి. లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో భీభత్సం సృష్టించింది. లాస్‌ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని ఈ టోర్నడో కుదిపేసింది. టోర్నడో ప్రభావంతో భారీగా గాలిదుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ఇళ్లు…వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఇది అతిపెద్ద సుడిగాలిగా చెబుతున్నారు. ఈ టోర్నడో కారణంగా గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇళ్ల బయటపార్కు చేసి ఉంచిన కార్లు ధ్వంసమయ్యాయి. భారీ టోర్నడోకి పైకప్పులు కొట్టుకుపోయాయి. తీవ్రమైన పెను గాలుల ధాటికి విద్యుత్‌ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పౌరులు ఇబ్బందులకు గురయ్యారు. చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ టోర్నడో తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ టోర్నడో కారణంగా ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. మొత్తం సిటీలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. టోర్నడో వల్ల రహదారులు చెత్తాచెదారంతో నిండిపోయింది. మోంటెబెల్లోలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు మూసివేశారు. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..