Donald Trump: దేశద్రోహులా.. ఉగ్రవాదులా.. ఎందుకా సంకెళ్లు..! ట్రంపరితనానికి మానవత్వమే లేదా..?
ట్రంప్ అక్రమవలసదారులను ఎవరి దేశాలకు వాళ్లను పంపించేస్తున్నాడనే అనుకున్నాం ఇప్పటి వరకు. ప్యాసెంజర్ విమానాలు కాకుండా.. యుద్ధ విమానంలో పంపిస్తున్నప్పుడే ఏదో తేడా కొడుతోందే అనిపించింది. సరే.. అది ఆ దేశ పాలసీ కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నాం. 'మా దేశస్తులను పంపిస్తామంటే మేమే సహకరిస్తాం' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కాని, అంతా ఊహించినంత సాఫ్ట్‌గా అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ జరగడం లేదు. మనం ఊహిస్తున్న దానికి, అక్కడ కనిపిస్తున్న సీన్‌కి అసలు పోలికే లేదు.

ట్రంప్ అక్రమవలసదారులను ఎవరి దేశాలకు వాళ్లను పంపించేస్తున్నాడనే అనుకున్నాం ఇప్పటి వరకు. ప్యాసెంజర్ విమానాలు కాకుండా.. యుద్ధ విమానంలో పంపిస్తున్నప్పుడే ఏదో తేడా కొడుతోందే అనిపించింది. సరే.. అది ఆ దేశ పాలసీ కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నాం. ‘మా దేశస్తులను పంపిస్తామంటే మేమే సహకరిస్తాం’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కాని, అంతా ఊహించినంత సాఫ్ట్‌గా అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ జరగడం లేదు. మనం ఊహిస్తున్న దానికి, అక్కడ కనిపిస్తున్న సీన్‌కి అసలు పోలికే లేదు. మీరు విజువల్స్‌లో చూస్తూనే ఉన్నారు. చేతులకు ఆ బేడీలు వేయడమేంటి? కాళ్లకు సంకెళ్లు కట్టడమేంటి? ఒక ఉగ్రవాదిని చూసినట్టు ట్రీట్ చేయడమేంటి? వాళ్లేమైనా దేశద్రోహులా, ఉగ్రవాదులా, దొంగతనం చేశారా, హత్యలు చేశారా..? ఒక అమెరికన్‌ను అలా బేడీలు, సంకెళ్లు వేసి నడిపిస్తే ట్రంప్ ఊరుకుంటాడా? మరెందుకని ఆ తరహా ట్రీట్‌మెంట్..? ఆ కోణంలో ట్రంప్ ఎందుకు ఆలోచించలేకుండా పోతున్నారు? డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలోకి చొరబడడం తప్పే. వీసా గడువు తీరిన తరువాత కూడా అమెరికాలో ఉండడమూ తప్పే. కాని వాళ్లు వెళ్లింది బతకడానికి. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకోడానికి. అలా వెళ్లిన వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ట్యాక్స్ కట్టిన వాళ్లే వాళ్లంతా. అంతేతప్ప అమెరికాను దోచుకోడానికి వెళ్లలేదు. అలాంటప్పుడు.. ఇంత దారుణంగా ట్రీట్ చేయడమేంటి? చేతులు, కాళ్లు కట్టేసి తీసుకొచ్చేంత నేరం...