AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? యూకే ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర.. భారత్‌లో మాత్రం 9 స్పూన్లు!

యూకేలో లభించే ఒక క్యాన్ ఫాంటాలో 63 కేలరీలు మాత్రమే ఉండగా, భారతదేశంలో విక్రయించే వెర్షన్‌లో దానికంటే మూడు రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది.  దీంతో భారత్ లో విక్రయించే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, శీతల పానీయాల ఉత్పత్తుల పై  మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.  దీనికి ప్రధాన కారణం అక్కడ అమల్లో ఉన్న కఠినమైన 'షుగర్ టాక్స్' (చక్కెర పన్ను), ప్రభుత్వ నిబంధనలని తేలింది.

ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? యూకే ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర.. భారత్‌లో మాత్రం 9 స్పూన్లు!
Why Fanta In Uk Has Less Sugar Than In India
Sharada V
|

Updated on: Sep 08, 2026 | 5:31 PM

Share

లండన్‌లో విక్రయించే ఒక క్యాన్ ఫాంటాలో కేవలం 63 కేలరీలు ( 3-4 స్పూన్ల చక్కెర) మాత్రమే ఉండగా, భారతదేశంలో విక్రయించే అదే సైజ్ క్యాన్‌లో 185 కేలరీలు (సుమారు 9-10 స్పూన్ల చక్కెర) ఉంటోంది. ఒకే అంతర్జాతీయ బ్రాండ్ అయినప్పటికీ, దేశాన్ని బట్టి నాణ్యత, చక్కెర శాతంలో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై ఆహార భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూకేలో ‘కోల్డ్ డ్రింక్ టాక్స్’

యూకేలో శీతల పానీయాలలో చక్కెర స్థాయిని బట్టి పన్ను విధిస్తారు. 100 మిల్లీలీటర్లకు  5 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఉంటే కంపెనీలు భారీగా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం తప్పించుకోవడానికి కోకాకోలా కంపెనీ అక్కడ చక్కెర శాతాన్ని 4.5 గ్రాములకు తగ్గించి, స్వీట్నర్స్ వాడుతోంది.

భారతదేశంలో జీఎస్టీ మాత్రమే

భారత్‌లో శీతల పానీయాలపై సుమారు 40% జీఎస్టీ (GST + Cess) విధిస్తున్నప్పటికీ.. అది పానీయంలో ఉండే చక్కెర శాతంతో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుంది. అందువల్ల చక్కెర తగ్గించాలనే ఒత్తిడి కంపెనీలపై ఉండదు. 

 యూరప్ దేశాలలో కృత్రిమ రంగులు వాడితే ప్యాకెట్ ముందు భాగంలో ‘ఫ్రంట్-ఆఫ్-ప్యాక్’ (FOPL) హెల్త్ వార్నింగ్ ఇవ్వడం తప్పనిసరి. కానీ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం వెనుక భాగంలో చిన్న అక్షరాలతో ఇస్తే సరిపోతుంది. దీనిని ఆసరాగా చేసుకుని కంపెనీలు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.

అలవాట్లు కారణమా?

భారతీయ వినియోగదారులు సాధారణంగా ఎక్కువ తీపి, బ్రైట్ ఆరెంజ్ రంగును ఇష్టపడతారనే ఉద్దేశ్యంతో కంపెనీలు స్థానిక రుచులకు అనుగుణంగా రెసిపీని మారుస్తున్నాయి. 

భారతదేశంలో మధుమేహం (Diabetes), ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయుల ఆరోగ్యంతో ముడిపడిన ప్రమాణాల విషయంలో వివక్ష చూపడం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కూడా చక్కెర శాతాన్ని బట్టి పన్నులు విధించేలా, ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరికలు ముద్రించేలా కఠినమైన చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు సీరియస్

అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉండే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల  లేబుల్స్ విషయంలో  ‘ఫ్రంట్-ఆఫ్-పాక్’ (ముందు భాగంలో స్పష్టంగా కనిపించే) హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేసే విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అనుసరిస్తున్న తీరును సుప్రీంకోర్టు ఇటీవల తప్పుబట్టింది . ప్యాకేజ్డ్ ఆహారాల్లోని హానికర పదార్థాల గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించడంలో రెగ్యులేటరీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.

Follow Us
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ప్రధాని మోదీ ముంబై పర్యటన వేళ తుపాకీ కలకలం..!
ప్రధాని మోదీ ముంబై పర్యటన వేళ తుపాకీ కలకలం..!
శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు
శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు
బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?
బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?
కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే
కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే
రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!
రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!