Salman Rushdie: ‘మిడ్‌నైట్ చిల్డ్రన్‌’తో ఫేమస్.. ‘సాటానిక్ వెర్సెస్‌’తో వివాదాస్పదం.. ఇంతకీ ఆ నవలలో ఏముందంటే?

|

Aug 13, 2022 | 5:12 AM

ఇరాన్ నుంచి వచ్చిన ముప్పు చిన్నదేమీ కాదు. ఎందుకంటే రష్దీని చంపిన వ్యక్తికి $3 మిలియన్ల(సుమారు రూ. 26 కోట్లు) రివార్డు ప్రకటించారు. 2012లో మరోసారి చంపేస్తామని బెదిరించారు.

Salman Rushdie: మిడ్‌నైట్ చిల్డ్రన్‌తో ఫేమస్.. సాటానిక్ వెర్సెస్‌తో వివాదాస్పదం.. ఇంతకీ ఆ నవలలో ఏముందంటే?
Salman Rushdie
Follow us on

Salman Rushdie: సాహిత్య ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారంటూ ఉండరు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదే ఈయన జన్మించారు. భారతదేశంలో పుట్టి, బ్రిటన్ పౌరసత్వం తీసుకుని, ఇప్పుడు అమెరికా పౌరసత్వంతో అక్కడే స్థిరపడ్డారు. ఆయన పేరే సల్మాన్ రష్దీ. అతను ముంబైలోని కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో 19 జనవరి 1947 న జన్మించాడు. 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి అవిభక్త భారతదేశంలో జన్మించిన పిల్లలపై ఒక నవల రాశారు. దానిపేరు ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’. పుస్తకం ఎంతో పాపులర్ అయింది. ఈ నవలకు ‘బుకర్ ప్రైస్’ కూడా వచ్చింది. ఇది అతని రెండవ నవల.

1988లో మరో పుస్తకం రాశారు. దాని పేరు ‘సాటానిక్ వెర్సెస్’. ఆయన రాసిన ఈ పుస్తకంపై చాలా దుమారం రేగింది. వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలు రక్తపాతానికి దిగారు. ఈ పుస్తకం భారతదేశంలో నిషేధించారు. 1989లో ఇరాన్ అతనిపై ఫత్వా జారీ చేసింది. కొద్ది రోజుల తర్వాత ముంబైలో జరిగిన అల్లర్లలో 12 మంది చనిపోయారు. బ్రిటన్ వీధుల్లో రష్దీ దిష్టిబొమ్మలను కాల్చారు. పుస్తకాలను తగలబెట్టారు. దీని తరువాత రష్దీ దాదాపు ఒక దశాబ్దం పాటు అండర్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయినా అప్పటికి కూడా రాయడం ఆపలేదు. పదేళ్ల తర్వాత అతని జీవితం క్రమంగా సాధారణ స్థితికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్‌లోని చౌటుప్పల్ ఇన్‌స్టిట్యూషన్‌లో అతనిపై కత్తితో దాడి చేశారు. రష్దీ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ప్రసంగాలు చేశారు. ఈసారి కూడా అక్కడ సమ్మర్‌టైమ్ లెక్చర్ సిరీస్ నిర్వహిస్తున్నారు. రష్దీని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలుస్తోంది. మరోవైపు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 80ల నుంచి రష్దీకి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన రాసిన ‘సాటానిక్ వెర్సెస్’ నవల దీనికి పెద్ద కారణంగా నిలిచింది.

అయితే ఆ పుస్తకంలో ఏముంది?

రష్దీ రాసిన మిడ్‌నైట్ చిల్డ్రన్ పుస్తకానికి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. అదే పేరుతో ఈ నవల మీద సినిమా కూడా తీశారు. కానీ, అతని నాల్గవ నవల ‘సాటానిక్ వెర్సెస్’ ఒక రచ్చ సృష్టించింది. మీడియా కథనాల ప్రకారం, ఈ నవల విషయం ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందంటూ వివాదాలు మొదలయ్యాయి. ఇస్లాం దేవుడిపై ఆరోపణలు చేశారంటూ గొడవలు మొదలయ్యాయి.

రష్దీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. అతని ఈ నవల కారణంగా 1988 నుంచి హత్య బెదిరింపులు రావడం ప్రారంభించాయి. అతనిపై ఫత్వాలు జారీ అయ్యాయి. అతను భారతదేశానికి తిరిగి రావడం కష్టంగా మారింది. అనేక సాహిత్య ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరుకున్నా.. భారతదేశానికి రాలేకపోయాడు.

హంతకుడికి $3.3 మిలియన్ రివార్డు..

ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ నవల Satanic Verses చూసి ఎంతగా నలిగిపోయారంటే, వారు అతనిని చంపేందుకు సిద్ధమయ్యారు. ఇరాన్‌లో రిపబ్లిక్ వ్యవస్థాపకుడు, అత్యున్నత నాయకుడు అయిన అయతుల్లా రుహోల్లా ఖొమేనీ కూడా 1989లో అతనికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన ముప్పు చిన్నదేమీ కాదు. ఎందుకంటే రష్దీని చంపిన వ్యక్తికి $3 మిలియన్ల( సుమారు రూ. 26 కోట్లు) రివార్డు ప్రకటించారు. 2012లో మరోసారి చంపేస్తామని బెదిరించారు. ఇరాన్‌లోని ఒక మతపరమైన సంస్థ అతని హత్యకు రివార్డ్ మొత్తాన్ని $3 మిలియన్ల నుంచి $3.3 మిలియన్లకు పెంచింది.

సల్మాన్ రష్దీపై ఘోరమైన దాడి..

1988లో రష్దీ నవల భారతదేశంలో నిషేధించబడినప్పుడు, రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ పుస్తకం గురించి తనపై వచ్చిన ఆరోపణలపై రష్దీ తన అనేక ఇంటర్వ్యూలలో ‘ది సాటానిక్ వెర్సెస్’ విచారణ లేకుండా నిషేధించారంటూ చెప్పుకొచ్చారు.