Honest City: ప్రపంచంలో నిజాయతీ కలిగిన నగరాలు ఏమిటో మీకు తెలుసా? మన దేశంలో ఏ నగరం ఆ లిస్టులో ఉందంటే..

|

Sep 27, 2021 | 8:08 PM

ప్రపంచంలో నిజాయతీ గల పౌరులు ఉన్న నగరం ఏది అనే సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? సాధారణంగా మనకు అటువంటి డౌట్లు పెద్దగా రావు కానీ, ఏ నగరం నివాసానికి మంచిది? ప్రపంచంలో అందమైన నగరం ఏది? ఇటువంటి సర్వేలు చేసే వారికి వస్తుంది.

Honest City: ప్రపంచంలో నిజాయతీ కలిగిన నగరాలు ఏమిటో మీకు తెలుసా? మన దేశంలో ఏ నగరం ఆ లిస్టులో ఉందంటే..
Honest City
Follow us on

Honest City: ప్రపంచంలో నిజాయతీ గల పౌరులు ఉన్న నగరం ఏది అనే సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? సాధారణంగా మనకు అటువంటి డౌట్లు పెద్దగా రావు కానీ, ఏ నగరం నివాసానికి మంచిది? ప్రపంచంలో అందమైన నగరం ఏది? ఇటువంటి సర్వేలు చేసే వారికి వస్తుంది. వస్తుంది ఏమిటి వచ్చింది. వారికీ వచ్చిన సందేహం ఏమిటంటే.. ప్రపంచంలో నిజాయతీ గల నగరం ఏది? అని. వెంటనే వాళ్ళు సర్వే చేసేశారు. సాధారణంగా సర్వే అంటే, కొంతమందికి కొన్ని ప్రశ్నలు వేసి.. వాటికి వారిచ్చిన సమాధానాలను విశ్లేషించి.. ఒక రిజల్ట్ బయటకు తీస్తారు. దానినే ప్రకటిస్తారు. కానీ, మీరు నిజాయతీ పరులా? అని ఎవరినైనా అడిగితే ఎవరైనా ఏమి చెబుతారు? మా అంత శుద్ధ పూస ఎవరూ లేరనే కదా. మరి ఇటువంటి క్లిష్టమైన సందేహానికి సమాధానం ఎలా? దానికోసమే ఒక మంచి ప్రయోగం చేశారు.. కూసింత ఖర్చు ఎక్కువైనా రిజల్ట్ మాత్రం బానే వచ్చింది. ప్రపంచంలో నిజాయతీ గల నగరం అనే అంశంపై రీడర్స్ డైజెస్ట్ ఓ సామాజిక ప్రయోగం చేసింది. ఆ వివరాలు తెల్సుకుందాం. అన్నట్టు ఈ నిజాయతీగల నగరాల లిస్టులో మన దేశంలోని ముంబయి మహానగరం రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇంతకీ ఆ లెక్క ఎలా తెల్చారో వింటే ఆశ్చర్యపోతారు మీరు.

రీడర్స్ డైజెస్ట్ విలేకరులు ప్రపంచవ్యాప్తంగా 16 నగరాలు ఎంచుకున్నారు. అవి.. ఆమ్‌స్టర్‌డ్యామ్, బెర్లిన్, బుకారెస్ట్, బుడాపెస్ట్, హెల్సింకి, లిస్బన్, లుబ్జానా, లండన్, మాడ్రిడ్, మాస్కో, ముంబై, న్యూయార్క్, ప్రేగ్, రియో ​​డి జనీరో, వార్సా అలాగే జ్యూరిచ్. ఇక్కడ వారు ఒక్కో నగరంలోనూ 12 వాలెట్లు అక్కడక్కడ వదిలివేశారు. అంటే మొత్తం 192 వాలెట్లు. ఈ వాలెట్లలో ఓ ఏభై డాలర్ల విలువైన స్థానిక కరెన్సీ, వ్యాపారానికి సంబంధించిన కార్డులు, గిఫ్ట్ కూపన్లు.. మొబైల్ నెంబర్, వారి కుటుంబ ఫోటోలను ఉంచారు. కొంత వ్యవధి తరువాత ఏ నగరంలో ఎన్ని వాలెట్లు వెనక్కి తిరిగి వచ్చాయనేది పరిశీలించారు. అంటే, ఈ వాలెట్లు దొరికిన వారు అందులోని ఫోన్ నెంబర్.. కార్డుల్లోని ఎడ్రస్ ఆధారంగా వాలెట్ ఎవరిదీ అని తెలుసుకుని అప్పగిస్తారా? లేదా అనేది కొలమానం అన్నమాట. ఈ లెక్కలో ఫిన్లాండ్ దేశానికి చెందినా హెల్సింకి టాప్ ర్యాంక్ కొట్టేసింది. అక్కడ వీరు వదిలిపెట్టేసిన 12 వాలెట్లలో 11 తిరిగి వారి వద్దకు చేరిపోయాయి. ఇక మన ఆర్ధిక రాజధాని ముంబయిలో 9 వాలెట్లు వెనక్కి వచ్చేయడంతో రెండో స్థానంలో నిలిచింది.

ఇక చివరి స్థానంలో పోర్చుగల్ కు చెందిన లిస్బన్ నిలిచింది. ఇక్కడ ఈ విలేకరి వదిలేసిన వాలెట్లలో ఒకే ఒక్క వాలెట్ వెనక్కి తిరిగి వచ్చింది.

అదండీ సంగతి.. ఇంతకీ మొత్తం 192 వాలెట్లు విలేకరులు వదిలేస్తే తిరిగి వచ్చినవి ఎన్నో తెలుసా? కేవలం 90 మాత్రమె. అంటే.. మిగిలినవి దొరికిన వారు నొక్కేశారన్న మాట.

Also Read:

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..