యుద్ధం భూమిని తలపించిన పార్లమెంట్.. ముష్టియుద్ధం చేసుకున్న ఎంపీలు.. నెట్టింట్లో వీడియో వైరల్

|

May 18, 2024 | 7:50 PM

పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన తైవాన్ పార్లమెంట్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ దాడి చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు ఫైళ్లు దొంగిలించి పార్లమెంటు బయటకు పరుగులు పెడుతున్న వీడియోలతోపాటు సభలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

యుద్ధం భూమిని తలపించిన పార్లమెంట్.. ముష్టియుద్ధం చేసుకున్న ఎంపీలు.. నెట్టింట్లో వీడియో వైరల్
Brawl In Taiwan Parliament
Follow us on

ప్రజల కోసం పార్లమెంట్లో సమావేశం అయ్యే ప్రతినిధులు తమ హోదాను మరచి పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ముష్టిఘాతాలు విసురుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. దీంతో పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన తైవాన్ పార్లమెంట్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఈ దాడి చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు ఫైళ్లు దొంగిలించి పార్లమెంటు బయటకు పరుగులు పెడుతున్న వీడియోలతోపాటు సభలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) పార్టీ విజయం సాధించింది. లైచింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కోల్పోయిన డీపీపీ మెజార్టీ లైచింగ్ పార్లమెంట్ లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.

దీంతో రాజ్యాంగ విరుద్ధమైన అధికార దుర్వినియోగం అనే బిల్లును డీపీపీ ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. KMT, TPP సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసినట్లు భావించే అధికారులను నేరంగా పరిగణించే వివాదాస్పద బిల్లుతో సహా ప్రభుత్వంపై పార్లమెంటుకు ఎక్కువ పరిశీలన అధికారాలు ఇవ్వాలని ప్రతిపక్షం కోరుతోంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..