Viral Video: అయ్యబాబోయ్‌.. కరోనా పుట్టినింట మరో షాకింగ్‌ సీన్‌..! చైనాలో పురుగుల వర్షం కురిసిందట..!!

|

Mar 10, 2023 | 2:37 PM

ముఖ్యంగా ప్రకృతిలో ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్ని అయోమయానికి గురిచేస్తుంటాయి. అలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి చైనాలో జరిగింది. అకస్మాత్తుగా ఒకరోజు పురుగుల వర్షం కురిసింది.

Viral Video: అయ్యబాబోయ్‌.. కరోనా పుట్టినింట మరో షాకింగ్‌ సీన్‌..! చైనాలో పురుగుల వర్షం కురిసిందట..!!
Beijing Worm Rains
Follow us on

సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా ఈ భూమ్మీద సమాధానం లేని అనేక సందేహాలు మిగేలి ఉన్నాయి. అలాంటి ప్రశ్నలు ఎదురుపడినప్పుడు సహజంగానే మనమందరం గందరగోళానికి గురవుతాము. ముఖ్యంగా ప్రకృతిలో ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ప్రజల్ని అయోమయానికి గురిచేస్తుంటాయి. అలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి చైనాలో జరిగింది. చైనాలోని బీజింగ్‌లో అకస్మాత్తుగా ఒకరోజు పురుగుల వర్షం కురిసింది. వాటిలో కొన్ని కీటకాలు కూడా ఉన్నాయని చైనా మీడియా వెల్లడించింది. వర్షం పడిన తర్వాత నగరంలోని పలు చోట్ల వాహనాలు, దుకాణాలు, వీధుల్లో పురుగులు స్వైరవిహారం చేయడంతో జనం కూడా భయాందోళనకు గురయ్యారని చైనా మీడియా పేర్కొంది.

బయటకు వెళ్లేవారు గొడుగులు తీసుకెళ్లడం మర్చిపోకూడదని కూడా అక్కడి అధికారులు ప్రకటించినట్టుగా కొన్ని చైనా మీడియా కథనాలు చెబుతున్నాయి. వైరల్‌ అవుతున్న ఫోటోలు, వీడియోల్లో క్రిములు రాకుండా గొడుగులు పట్టుకుని నిల్చున్నట్లు కనిపిస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంతకీ అసలు సంగతి ఏంటన్నది ఆరా తీయగా..

ఇవి పురుగులు, కీటకాలు కాదని చైనాలో కనిపించే పాప్లర్ పువ్వులు అని కొందరు అంటున్నారు. చెట్లు పువ్వులు, కాయలతో నిండి ఉన్నప్పుడు ఇలా నేలరాలుతుంటాయని చెబుతున్నారు. పూలు రాలిపోతే పురుగుల్లా కనిపిస్తాయని ఓ వర్గం చెబుతోంది. ఇందులో అసహజమేమీ లేదని మరో వర్గం అంటోంది. ఇంతకు ముందు కూడా చాలా చోట్ల ఈ తరహా వింత వర్షాలు కురిశాయని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..