Mt. Everest: ఎవరెస్ట్ పర్వతం మీద రెండు గ్రూపుల మధ్య కొట్లాట.. సిల్లీ రీజన్‌తో మరీ ఇలానా

|

Jul 10, 2024 | 1:27 PM

ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అదొక సాహస కార్యం. కష్టతరమైన, ప్రమాదకరమైన ప్రదేశానికి చేరుకుని కూడా సెల్ఫీ కోసం కొట్లాడు కోవడం ఆశ్చర్యంగా ఉంది. 29,030 అడుగుల ఎత్తులో ఉన్న వ్యూయింగ్ పాయింట్‌లో రెండు వేర్వేరు పర్యాటకుల బృందాల మధ్య జరిగిన ఈ పోరు.. ఎటువంటి ప్రమాదకర ప్రాంతలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలోనైనా తమ జీవితంలో చిరస్మరణీయంగా నిలిచే క్షణాలను ఫోటోలు తీసుకోవడానికి ఎంతవరకైనా వెళ్లగలరని ఈ సంఘటన నిరూపించింది.

Mt. Everest: ఎవరెస్ట్ పర్వతం మీద రెండు గ్రూపుల మధ్య కొట్లాట.. సిల్లీ రీజన్‌తో మరీ ఇలానా
Mt. Everest Tourists
Image Credit source: the new york post /Instagram/@nimsda
Follow us on

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం అంటే ప్రాణాలతో తమ ప్రాణాలతో తామే చెలగాటం ఆడుకోవడమే..అటువంటి ఎవరెస్టు పర్వతాన్ని ఎన్నో అడ్డంకులు దాటి అధిరోహించి సరదాగా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన సమయంలో సెల్ఫీల కోసం కొట్లాడుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అవును ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అదొక సాహస కార్యం. కష్టతరమైన, ప్రమాదకరమైన ప్రదేశానికి చేరుకుని కూడా సెల్ఫీ కోసం కొట్లాడు కోవడం ఆశ్చర్యంగా ఉంది. 29,030 అడుగుల ఎత్తులో ఉన్న వ్యూయింగ్ పాయింట్‌లో రెండు వేర్వేరు పర్యాటకుల బృందాల మధ్య జరిగిన ఈ పోరు.. ఎటువంటి ప్రమాదకర ప్రాంతలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలోనైనా తమ జీవితంలో చిరస్మరణీయంగా నిలిచే క్షణాలను ఫోటోలు తీసుకోవడానికి ఎంతవరకైనా వెళ్లగలరని ఈ సంఘటన నిరూపించింది.

ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం ఈ షాకింగ్ సంఘటన జూన్ 25 న జరిగింది. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో ఉన్న 8,848 వ్యూ ప్లాట్‌ఫారమ్‌లో ఫోటోలు తీసుకోవడానికి రెండు పర్యాటక బృందాలు ఎవరెస్ట్ ఎలివేషన్ మాన్యుమెంట్ సమీపంలోకి చేరుకున్నారు.

మొదట వాగ్వాదానికి దిగారు.

సెల్ఫీకి బెస్ట్ ప్లేస్‌పై మొదట టూరిస్టుల మధ్య వాగ్వాదం మొదలైందని, కొద్దిసేపటికే గొడవగా మారిందని చెబుతున్నారు. సెల్ఫి తీసుకునే విషయంలో ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. దీనిలో ఒక మహిళ ఈ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అప్పటికి వివాదం పెరిగి పెద్దదైంది.

ఇవి కూడా చదవండి

నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు

నివేదిక ప్రకారం ఎవరెస్ట్ బోర్డర్ పోలీస్ క్యాంప్ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన స‌మాచారం అందిస్తామ‌ని అధికారులు హామీ ఇచ్చారు.

ఎవరెస్ట్‌పై రద్దీ సమస్య

ఏప్రిల్‌లో పర్వతారోహకుల కోసం ఎవరెస్ట్ పర్వతం టిబెటన్ భాగాన్ని చైనా తెరిచింది. ఇది కోవిడ్ -19 వ్యాప్తి తర్వాత మూసివేయబడింది. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని ఎత్తైన పర్వతంపై రద్దీ సమస్య కూడా పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. గత నెలలో ఇద్దరు పర్వతారోహకులు కూడా తప్పిపోయారు. పర్వతంలోని ఒక శిఖరం కూలిపోవడంతో చనిపోయినట్లు భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..