Los Angeles: మండుతోన్న లాస్ ఏంజిల్స్ 24 మంది మృతి, 12 వేల భవనాలు ధ్వంసం..

|

Jan 13, 2025 | 11:18 AM

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదం వలన జరిగిన నష్టం బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో నీరు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనిపై కాలిఫోర్నియా గవర్నర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. లాస్ ఏంజిల్స్ మంటల మధ్య ఓ యువకుడు తప్పి పోయిన తన పెంపుడు కుక్కను పట్టుకున్నాడు. పోగొట్టుకున్నానెమో అంటూ భయపడిన అతను పెంపుడు జంతువు దొరకడంతో హర్షం వ్యక్తం చేస్తూ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Los Angeles: మండుతోన్న లాస్ ఏంజిల్స్ 24 మంది మృతి, 12 వేల భవనాలు ధ్వంసం..
Los Angeles Wildfires Flames
Follow us on

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని పోష్ ఏరియా గత 6 రోజులుగా మండుతోంది. అడవుల నుంచి వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలకు చేరాయి. ఈ అగ్నిప్రమాదం అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా నిలుస్తోంది. దాదాపు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో అగ్ని దహనం చేస్తోంది. ఈ ప్రమాదంలో 12 వేలకు పైగా భవనాలు కాలి బూడిదయ్యాయి. లాస్ ఏంజిల్స్ సినిమా తారల నివాసానికి ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో, బలమైన గాలులు లాస్ ఏంజిల్స్‌లోని అడవి మంటలను మరింత విధ్వంసకరంగా మార్చాయి. అగ్నిప్రమాదంలో కనీసం 24 మంది మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

  1. వాస్తవానికి, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే బలమైన గాలులు అగ్నిని అదుపులో చేయడం కష్టతరంగా చేస్తున్నాయి. ఈ వారంలో మళ్లీ బలమైన గాలులు వీయడంతో మంటలు మరింత తీవ్రంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనీసం 16 మంది గల్లంతయ్యారని ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని కలిసిన తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మంటల్లో అతని క్క తప్పిపోయింది. ఇప్పుడు వీరి కలయికకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
  2. పసిఫిక్ పాలిసాడ్స్ పరిసరాల్లో భారీ మంటలు చెలరేగాయి. ఇక్కడ కేసీ కొల్విన్ అనే వ్యక్తీ పెంపుడు కుక్క తప్పి పోయి.. పొరుగు ఇంటి శిథిలాల మధ్య నిద్రిస్తోంది. కొన్న రోజుల తర్వాత తన కుక్క ఓరియోను గుర్తించాడు. దీనికి కుక్క ట్రాకర్ సహాయం చేసింది. తన యజమానికి చూసిన ఆనందంతో కుక్క పరిగెత్తుకుని యజమానం దగ్గరకు చేరుకుంటుంటే.. తన కుక్కను చూసి ఆనందంతో కేసీ కొల్విన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
  3. లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు
  4. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోని అడవి మంటల్లో మరణించిన వారి సంఖ్య 24 కి పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను నియంత్రించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ బుధవారం వరకు తీవ్రమైన అగ్నిప్రమాదం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పర్వతాలలో ఈ వేగం గంటకు 113 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం మరింత ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ నిపుణుడు రిచ్ థాంప్సన్ తెలిపారు.
  5. లాస్ ఏంజిల్స్ నగరంలోని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో మొత్తం 24 మంది మరణించారని, వారిలో ఐదుగురు పాలిసాడ్స్‌లో మరణించగా, 11 మంది ఈటన్ ప్రాంతంలో మరణించారని తెలిపారు. అంతకుముందు 11 మంది మరణించినట్లు ధృవీకరించబడింది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
  6. తప్పిపోయిన ప్రజలకు సంబందించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఒక కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మళ్లీ బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫైటర్లు ఈ అగ్నిని అదుపు చేసేందుకుప్రయత్నిస్తున్నారు. పాల్ గెట్టి మ్యూజియం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వరకు విస్తరించింది.
  7. మాండెవిల్లే కాన్యన్‌లో మంటలను ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పసిఫిక్ తీరానికి సమీపంలో ఉన్న మాండెవిల్లే కాన్యన్, ప్రసిద్ధ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌తో సహా అనేక మంది ప్రముఖుల గృహాలు ఇక్కడ ఉన్నాయి. కాల్‌ఫైర్ ఆపరేషన్స్ చీఫ్ క్రిస్టియన్ లిట్జ్ ఒక బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ అగ్నిమాపక ఆపరేషన్ సమయంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం సమీపంలోని పాలిసాడ్స్ వ్యాలీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
  8. ప్రస్తుతం అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో తేలికపాటి గాలులు వీస్తున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బందికి సమస్యలను సృష్టించే బలమైన శాంటా అనా గాలులు త్వరలో తిరిగి రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తాయని, ఇది లాస్ ఏంజెల్స్ ,చుట్టుపక్కల ప్రాంతమంతా చుట్టుముట్టి.. తర్వాత ద్వసం చేయడం మొదలు పెడుతుందని హెచ్చరిస్తున్నారు.
  9. ఎనిమిది నెలలకు పైగా లాస్ ఏంజిల్స్‌లో చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. అగ్నిప్రమాదం కారణంగా ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రధాన ట్రాఫిక్ మార్గం అయిన ఇంటర్‌స్టేట్ హైవే 405కి కూడా ముప్పు ఉంది. అయితే అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
  10. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ విధ్వంసం ఆపడానికి శనివారం కూడా పని చేస్తూనే ఉన్నారు. బృందాలు కుక్కల సహాయంతో మృతదేహాలను వెదుకుతున్నాయి. పసదేనాలో కుటుంబ సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు లూనా తెలిపారు. నిర్వాసితులకు కర్ఫ్యూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
  11. దాదాపు 145 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. ఇంకా అగ్నిప్రమాదానికి గురైన ప్రాంతాలను ఖాళీ చేయమని వేలాది మందిని ఆదేశించారు. నగరానికి ఉత్తరాన జనసాంద్రత కలిగిన 40 కి.మీ ప్రాంతంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు మొదలైన 12,000 భవనాలు ధ్వంసమయ్యాయి.
  12. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆస్తి నష్టం పరంగా ఇది అతిపెద్ద అగ్నిప్రమాదం. Accuweather అంచనాల ప్రకారం ఇప్పటివరకు US$135 బిలియన్ల నుంచి US$150 బిలియన్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అల్టాడెనా నివాసి జోస్ లూయిస్ గోడినెజ్ అతని కుటుంబంలోని 10 మందికి పైగా సభ్యుల మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. అంతా అయిపోయిందని చెప్పాడు. తన కుటుంబం మొత్తం ఆ మూడు ఇళ్లలో నివసించేవారమని.. ఇప్పుడు తమకు ఏమీ మిగల లేదంటూ వాపోతున్నారు.
  13. కొంతమంది నివాసితులు తమ ఇంటిలోని వస్తువులను చూసుకునేందుకు కాలిపోయిన ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఇటువంటి ప్రజలకు అధికారులు హెచ్చరిస్తున్నారు. బూడిదలో సీసం, ఆర్సెనిక్, ఆస్బెస్టాస్ తదితర హానికరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉందని శనివారం అధికారులు వారిని హెచ్చరించారు. దెబ్బతిన్న ఆస్తుల అంచనా తర్వాత నివాసితులు రక్షణ పరికరాలు ధరించి తిరిగి రావడానికి అనుమతిస్తామని థామస్ చెప్పారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..