Uttarakhand: ఆస్కార్ విజేత విల్ స్మిత్‌కు హరిద్వార్‌తో ప్రత్యేక అనుబంధం.. శివయ్యకు పూజలు

|

Mar 31, 2022 | 10:14 AM

Uttarakhand: అమెరికా(America)కు చెందిన హాలీవుడ్‌(Hollywood) నటుడు ఆస్కార్ (Oscar) విజేత విల్ స్మిత్ (Will Smith) అంటే అభిమానులకు పిచ్చి. ఉత్తమ నటుడిగా 2022 ఆస్కార్ అవార్డును అందుకున్నందుకు..

Uttarakhand: ఆస్కార్ విజేత విల్ స్మిత్‌కు హరిద్వార్‌తో ప్రత్యేక అనుబంధం.. శివయ్యకు పూజలు
Oscar Winner Will Smith In
Follow us on

Uttarakhand: అమెరికా(America)కు చెందిన హాలీవుడ్‌(Hollywood) నటుడు ఆస్కార్ (Oscar) విజేత విల్ స్మిత్ (Will Smith) అంటే అభిమానులకు పిచ్చి. ఉత్తమ నటుడిగా 2022 ఆస్కార్ అవార్డును అందుకున్నందుకు విల్ స్మిత్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అయితే  ఈ పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కు భారత దేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌తో సన్నిహిత అనుబంధం ఉంది. హరిద్వార్‌లో ‘రుద్రాభిషేకం’ చేయడం ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతుంది. విల్ స్మిత్ హిందూ మతపరమైన సంప్రదాయాలు,  జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతాడు. అందుకే ఈ నమ్మకమే అతన్ని 2018లో హరిద్వార్‌కు తీసుకువచ్చింది. హరిహర్ ఆశ్రమంలో విల్ స్మిత్ రుద్రాభిషేకం చేసి గంగామాతకు పూజలు చేశారు. ఆ సమయంలో ప్రసిద్ధ జ్యోతిష్కుడు డాక్టర్ ప్రతీక్ మిశ్రపురి.. విల్ స్మిత్ తన జాతచక్రాన్ని పొందారు. అప్పుడు ప్రతీక్ మిశ్రపురి.. విల్ స్మిత్ హస్తసాముద్రికం ద్వారా జాతకచక్రాన్ని చెప్పారు. అప్పుడు 2022లో విల్ స్మిత్ కి అంతర్జాతీయ అవార్డు వస్తుందని ప్రతీక్ మిశ్రపురి చెప్పారు.

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన నటనతో అభిమానుల మనసు గెలుచుకున్న విల్ స్మిత్.. భారత్‌లోని హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాలను నమ్ముతాడు. హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్,  నటి నికోల్ కిడ్‌మాన్ ల సలహాలతో విల్ స్మిత్ హరిద్వార్ చేరుకున్నాడు. సిల్వెస్టర్ తన కుమారుడి మరణంతో అతని ఆత్మకు శాంతి చేకూరాలని 2014లో హరిద్వార్‌లో పిండప్రదానం చేశారు. అప్పటి నుండి సిల్వెస్టర్,  నికోల్ కిడ్‌మాన్ లు హరిద్వార్ లోని ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ ప్రతీక్ మిశ్రపురితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. డాక్టర్ మిశ్రపురి కాలిఫోర్నియా వెళ్లారు.

డాక్టర్ మిశ్రపురి సలహా మేరకు విల్ స్మిత్ తన జన్మ నక్షత్రం ప్రకారం గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలనుకున్నాడు. దీంతో 2018లో హరిద్వార్‌కు వచ్చి, కంఖాల్‌లోని హరిహర్ ఆశ్రమంలో విల్ స్మిత్ చేరుకున్నాడు. అక్కడ శివుడికి అభిషేకం చేశాడు. గంగా హారతిలో పాల్గొన్నాడు.

Also Read: Bhishma Niti: భార్య, భర్తలు ఓకే ప్లేట్‌లో భోజనం చేయవద్దు అంటున్న భీష్మ.. వెంట్రుక వచ్చిన అన్నం తింటే కలిగే ఫలితం ఏమిటో తెలుసా..