అమెరికాలోని న్యూయార్క్ నగరం వరదల కారణంగా అధ్వాన్న స్థితిలో ఉంది. దీంతో నగరంలో ఎమర్జెన్సీ విధించారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్డుపై తమ కార్లలో అనేక మంది చిక్కుకున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎటుచూసినా చుట్టూ నీరు మాత్రమే కనిపిస్తుంది. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ అధికారులు సూచనలు జారీ చేశారు.
ప్రజలు ఎక్కడికీ వెళ్ళవద్దు అంటూ నిషేధాజ్ఞలు విధించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మెట్రో సేవలు నిలిచిపోయాయి. రోడ్లు, రహదారులు జలమయమయ్యాయి. సబ్‌వే వ్యవస్థ నిలిచిపోయింది. వరదల కారణంగా లాగార్డియా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల (13 సెం.మీ.) కంటే ఎక్కువ వర్షం కురిసింది. నగరంలో ఏడు అంగుళాల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
New York: The rain isn’t over yet. It is extremely dangerous to travel on flooded streets.
As rain continues to impact downstate areas throughout the day, don’t attempt to walk, bike, or drive in these conditions.
Stay safe. pic.twitter.com/gGeCShKR87— Governor Kathy Hochul (@GovKathyHochul) September 29, 2023
న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, పగటిపూట 18 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని హోచుల్ తెలిపారు. అయితే వర్షం, వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. వరదలు, వర్షం కారణంగా ట్రాఫిక్ మొత్తం స్తంభించింది.
న్యూయార్క్ నగరం, లాంగ్ ఐలాండ్, హడ్సన్ వ్యాలీ అంతటా ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నానని చెప్పారు. విపరీతమైన వర్షపాతం కారణంగా ప్రాంతం అంతా జలమయం అయింది. నదులను తలపిస్తున్నాయి. కనుక ప్రజలు తమకు తాము సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రస్తుతం రోడ్డు మీద ప్రజలు ప్రయాణించవద్దు అంటూ హెచ్చరించారు.
I am declaring a State of Emergency across New York City, Long Island, and the Hudson Valley due to the extreme rainfall we’re seeing throughout the region.
Please take steps to stay safe and remember to never attempt to travel on flooded roads.
— Governor Kathy Hochul (@GovKathyHochul) September 29, 2023
ప్రిసిల్లా ఫోంటెల్లియో అనే మహిళ తన కారులో మూడు గంటల పాటు చిక్కుకుపోయిందని చెప్పారు. తన జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని ఫోంటెల్లియో చెప్పారు. ప్రస్తుతం నగరంలోని వర్షాలు, వరదలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో నగరంలో చుట్టూ నీరు కనిపిస్తుంది. రోడ్లపై కార్లు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..