8th Continent: 375 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన 8వ ఖండం దొరికిందోచ్..!
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా? అంటే ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు. దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్నిలేటెస్ట్‌గా గుర్తించారు. కొత్త ఖండానికి‘జీలాండియా’ లేదా ‘టె రీ-ఆ-మౌ’ అన్న పేరు కూడా పెట్టారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘టెక్టోనిక్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా? అంటే ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు. దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్నిలేటెస్ట్‌గా గుర్తించారు. కొత్త ఖండానికి‘జీలాండియా’ లేదా ‘టె రీ-ఆ-మౌ’ అన్న పేరు కూడా పెట్టారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘టెక్టోనిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జీలాండియా విస్తీర్ణం 1.89 మిలియన్ చదరపు మైళ్లని, మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువని బీబీసీ తెలిపింది. . ఈ కొత్త ఖండం దాదాపు 94 శాతం నీటి అడుగు భాగానే ఉంది. న్యూజిలాండ్ మాదిరిగా కేవలం కొన్ని ద్వీపాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించిన రాళ్ల నమూనాలను అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటిలో ఎక్కువ భాగం డ్రిల్లింగ్ సైట్‌ల నుంచి వచ్చినవని మరికొన్ని ఈ ప్రాంతంలోని ద్వీపాల తీరాల నుంచి సేకరించినవని అన్నారు. రాతి నమూనాల అధ్యయనంలో పశ్చిమ అంటార్కిటికాలోని భౌగోళిక నమూనాలు శాస్త్రవేత్తలకు కనిపించాయి. దీన్నిబట్టి న్యూజిలాండ్ పశ్చిమ తీరం క్యాంప్‌బెల్ పీఠభూమికి సమీపంలో సబ్‌డక్షన్ జోన్ లో జీలాడియా ఉండే అవకాశం ఉందని అన్నారు. కొత్తగా రూపొందించిన మ్యాప్ ప్రకారం.. జీలాండియా ఖండం భూఅయస్కాంత రేఖ మాత్రమే కాకుండా ఇతర ప్రధాన భౌగోళిక లక్షణాలను కూడా కలిగివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా జీలాండియా వాస్తవానికి పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగమని భావిస్తున్నారు. గోండ్వానా సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడటం గమనార్హం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

