ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నుంచి ముప్పు.. తక్షణమే ఆ దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం పిలుపు

| Edited By: Phani CH

Aug 07, 2021 | 5:15 PM

ఆఫ్ఘానిస్తాన్ లో నివసిస్తున్న తమ దేశీయులు తక్షణమే ఆ దేశాన్ని వదిలి రావాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని యూఎస్ ఎంబసీ శనివారం ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నుంచి ముప్పు.. తక్షణమే ఆ దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం పిలుపు
Taliban
Follow us on

ఆఫ్ఘానిస్తాన్ లో నివసిస్తున్న తమ దేశీయులు తక్షణమే ఆ దేశాన్ని వదిలి రావాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని యూఎస్ ఎంబసీ శనివారం ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. తాలిబన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య పోరు తీవ్రమవుతోందని, తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా ఇక ఈ దేశంలో మీకు భద్రత లేదని ఇందులో పేర్కొన్నారు. ఆఫ్ఘన్ లో అమెరికా బలగాలు, స్టాఫ్ కూడా పరిమితంగా ఉన్నారని, అందువల్ల దాడుల నుంచి మిమ్మల్ని రక్షించలేకపోవచ్చునని ఈ ప్రకటన స్పష్టం చేసింది.పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ కారణంగా ఇక మీరు జాప్యం చేయవద్దని, విమానాలకు టికెట్ కొనలేనివారికి అవసరమైతే రుణం కూడా ఇస్తామని వివరించారు. కాబూల్ బయట దేశీయ విమానాలు పరిమితంగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్ పోర్టేషన్ రూట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విమానాలను రద్దు చేయడమో..లేక ఈ మార్గాలను మూసివేయడమో కూడా జరగవచ్చు అని యూఎస్ ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.

నిన్న కాబూల్ లో ఓ మసీదు వద్ద ప్రభుత్వ మీడియా హెడ్ దావా ఖాన్ ను తాలిబన్లు కాల్చి చంపారు. అంతకు ముందు రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మద్ నివాసం వద్ద కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆయనను టార్గెట్ చేసుకునే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడ్డారు. పైగా ఒక్కొక్కటిగా రాష్ట్రాల రాజధానులను తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ దళాల వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ బార్డర్ రగడ.. నాలుగు లారీలు ధ్వంసం

కుంభ్ మేళాలో లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు.. 5 ల్యాబ్ లపై ఈడీ దాడులు.. 31 లక్షల స్వాధీనం