ఎటు చూసిన తెగిన విద్యుత్ తీగలు, కూలిన ఇళ్లు.. అమెరికాలో తుఫాను బీభత్సం, 34 మంది మృతి
అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో టోర్నడో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీని కారణంగా ఇప్పటి వరకు 34 మందికి పైగా మరణించారు. వందలామంది నిరాశ్రయులయ్యారు. పాఠశాలలు, ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది చెట్లు నేలకొరిగాయి. మిస్సోరి ప్రాంతంలో అత్యంత వినాశకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక అధికారులు అప్రమత్తమై, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు.

అమెరికాలోని అనేక ప్రాంతాలను టోర్నడోలు లాంటి భయంకరమైన తుఫాను తాకింది. దీని కారణంగా, అనేక రాష్ట్రాల్లో పాఠశాలలతో సహా వివిధ భారీ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వార్తా సంస్థ AP కథనం ప్రకారం, తుఫాను కారణంగా కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా అనేక భవనాలు కూలిపోయాయి. ఇక్కడ, కాన్సాస్ హైవే పెట్రోల్ ఎనిమిది మంది మరణించినట్లు నివేదించిన తర్వాత మరణాల సంఖ్య పెరిగింది. మిస్సిస్సిప్పిలో, మూడు కౌంటీలలో ఆరుగురు మరణించారని, మరో ముగ్గురు తప్పిపోయారని గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది గాయపడ్డారని ఆయన సోషల్ మీడియా ఎక్స్‌తో పేర్కొన్నారు.
టోర్నడోలు లాంటి తుఫాను కారణంగా ఎక్కడ చూసినా కూలిపోయిన చెట్లు, విరిగిన, ఇళ్ళు, భవనాలు కనిపించాయి. ఈ తుఫాను వచ్చిన తర్వాత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇండిపెండెన్స్ కౌంటీలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అర్కాన్సాస్ అధికారులు తెలిపారు. అర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ సాండర్స్ మాట్లాడుతూ, సుడిగాలి నష్టాన్ని సర్వే చేయడానికి బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు.
అధికారుల ప్రకారం, మిస్సోరీలో మరే ఇతర రాష్ట్రం కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. రాత్రంతా అప్పుడప్పుడు సుడిగాలులు కొనసాగాయని ఆయన అన్నారు. ఇక్కడ కనీసం 12 మంది మరణించారు. మృతుల్లో తుఫాను వల్ల ఇల్లు ధ్వంసమైన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక మొత్తంగా చూస్తే అమెరికాలో పెను తుఫాన్ బీభత్సం కారణంగా 34 మంది మృతి చెందారు. మిస్సోరీలో 12 మంది మృతి చెందగా, కాన్సాస్‌లో 8 మంది, మిస్సిస్సిప్పీలో ఆరుగురు, టెక్సాస్‌లో నలుగురు, ఆర్కన్సాస్‌లో ముగ్గురు మృతి చెందారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..