కరోనా వ్యాక్సిన్‌ పేటెంట్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన టెడ్రోస్

| Edited By: Ravi Kiran

May 06, 2021 | 10:12 PM

WHO Comments: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌పై ఏ దేశమూ పేటెంట్ కోసం ప్రయత్నించొద్దన్న...

కరోనా వ్యాక్సిన్‌ పేటెంట్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన టెడ్రోస్
Follow us on

WHO Comments: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌పై ఏ దేశమూ పేటెంట్ కోసం ప్రయత్నించొద్దన్న డిమాండ్‌కు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు తెలిపింది. ఆది నుంచి భారత్ ఈ డిమాండ్ చేస్తూనే వచ్చింది. అయితే, కొన్ని ప్రముఖ పత్రికలు భారత్ డిమాండ్‌ను తప్పుబట్టాయి. కానీ చివరకు వైట్‌హౌస్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపింది. కరోనాపై పోరాటంలో అమెరికా నిర్ణయం ఒక మైలురాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధానమ్ ట్వీట్ చేశారు.

వ్యాక్సిన్ పేటెంట్‌ తాత్కాలిక మినహాయింపునకు అమెరికా మద్దతివ్వడం కరోనా పోరాటంలో ఒక మైలురాయి. ఈ నిర్ణయం కరోనా పోరాటంలో అమెరికా విజ్ఞత, నైతిక నాయకత్వం, మహమ్మారికి ఫుల్‌స్టాప్ పెట్టడం కోసం అగ్రరాజ్యం చేస్తున్న కృషికి నిదర్శనం.’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?