AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine-Russia: కొనసాగుతున్న హైటెన్షన్.. ఉక్రెయిన్ వేర్పాటువాదులకు రష్యా గుర్తింపు.. కఠిన ఆంక్షలు విధించిన యూఎస్, యూకే

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య హై టెన్షన్‌..పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో ఫిరంగుల మోత మోగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. యుద్ధానికే సై అంటున్నారు.

Ukraine-Russia: కొనసాగుతున్న హైటెన్షన్.. ఉక్రెయిన్ వేర్పాటువాదులకు రష్యా గుర్తింపు.. కఠిన ఆంక్షలు విధించిన యూఎస్, యూకే
Ukraine Russia
Balaraju Goud
|

Updated on: Feb 22, 2022 | 8:46 AM

Share

Ukraine – Russia Conflicts: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య హై టెన్షన్‌..పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో ఫిరంగుల మోత మోగుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin).. యుద్ధానికే సై అంటున్నారు. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వేర్పాటువాదులను రష్యా గుర్తించిన తర్వాత, అమెరికా(America) కఠినమైన ప్రకటన చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాల డోనెట్స్క్‌(DNR), లుహాన్స్క్‌(LNR)లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. పుతిన్‌ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.

రష్టా అధ్యక్షులు పుతిన్ ప్రకటన తర్వాత అమెరికా జాతీయ భద్రత బృందంతో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలపైనే చర్చించారు. అంతర్జాతీయ కట్టుబాట్లను రష్యా ఉల్లంఘించిందని మండిపడుతున్న బైడెన్‌.. రష్యాపై మరిన్ని ఆంక్షలకు ఆదేశించారు. రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన చోట.. కొత్తగా పెట్టుబడులు, వాణిజ్యం, ఇతర కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు తెలిపాయి. దీనిని అనుసరించి యునైటెడ్ స్టేట్స్ సోమవారం తూర్పు ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాలపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది. వీటిని రష్యా తిరిగి గుర్తించింది. అవసరమైతే మరిన్ని చర్యలకు సిద్ధమని అమెరికా.. తూర్పు ఉక్రెయిన్‌ను హెచ్చరించింది. అయితే రష్యా ప్రకటనపై వైట్ హౌస్ ప్రకటనను ప్రస్తావిస్తూ, ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ, ఉక్రెయిన్DNR (డొనెట్స్క్), LNR (లుహాన్స్క్) ప్రాంతాలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అమెరికన్ పౌరులను అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వును అధ్యక్షుడు బిడెన్ త్వరలో జారీ చేస్తారని చెప్పారు. వ్యాపారం చేయడం, ఫైనాన్సింగ్ చేయడం నిషేధించినట్లు తెలిపారు.

ఈయూ దేశాలు కూడా పుతిన్ ప్రకటనపై సీరియస్‌ అవుతున్నాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికే మద్దతిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను గుర్తించిన రష్యా చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని యూరోపియన్ యూనియన్ పేర్కొంది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జో బిడెన్‌తో కూడా చర్చించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బిడెన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో చర్చలకు కూడా ప్రణాళిక రూపొందించారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలను వైట్‌హౌస్ ధృవీకరించింది. అటు, పుతిన్‌ చర్యలను తప్పుబట్టిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌.. ఉక్రెయిన్‌కు అవసరమైన సాయమందిస్తామని ప్రకటించారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇవాళ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఉక్రెయిన్‌ సంక్షోభంపైనే చర్చించనుంది.

Read Also… Petrol Price Today: పైపైకి ముడి చమురు ధరలు.. అయినా స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్స్‌..