Sri Lanka: బ్రిటన్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన శ్రీలంక.. కొలంబో పోర్టు నుంచి కార్గో షిప్‌‌లను వెనక్కు.. ఎందుకో తెలుసా?

బ్రిటన్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చింది శ్రీలంక. కొలొంబో పోర్టుకు వచ్చిన కంటైనర్లను తిరిగి వెనక్కు పంపింది. పలు ఆసియా దేశాలను డంపింగ్‌ యార్డులుగా వాడుకుంటున్నాయి పశ్చిమ దేశాలు.

Sri Lanka: బ్రిటన్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన శ్రీలంక.. కొలంబో పోర్టు నుంచి కార్గో షిప్‌‌లను వెనక్కు.. ఎందుకో తెలుసా?
Cargo Ship
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2022 | 7:49 AM

Srilanka on UK Cargo Ships: బ్రిటన్‌(Britain) ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చింది శ్రీలంక. కొలొంబో(Colombo) పోర్టుకు వచ్చిన కంటైనర్లను తిరిగి వెనక్కు పంపింది. పలు ఆసియా దేశాలను డంపింగ్‌ యార్డులుగా వాడుకుంటున్నాయి పశ్చిమ దేశాలు. టన్నుల కొద్దీ వ్యర్థాల(Illegally Imported Waste)ను నౌకల ద్వారా రవాణా చేసి ఆసియా దేశాల్లో పడేస్తున్నాయి. దీనిపై శ్రీలంక చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యింది. అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3 వేల టన్నుల చెత్తను, బ్రిటన్‌కు తిప్పి పంపింది. చివరిగా 45 కంటైనర్లతో ఉన్న కార్గో షిప్‌ కొలంబో పోర్టు నుంచి బ్రిటన్‌కు బయలుదేరింది. 2017 నుంచి 2019 వరకు బ్రిటన్‌లోని ఓ కంపెనీ నుంచి శ్రీలంకకు సుమారు మూడు వేల టన్నుల చెత్త చేరింది.

వాడేసిన పరుపులు, కార్పెట్లు, రగ్గులను ఇక్కడికి పంపిస్తోంది బ్రిటన్. అక్కడి నుంచి ఇతర దేశాలకు వాటిని పంపుతామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంటైనర్లను తెరిచి చూసి షాకయ్యారు శ్రీలంక కస్టమ్స్‌ అధికారులు. ఆసుపత్రుల వ్యర్థాలు, మార్చురీల నుంచి, పోస్ట్‌మార్టం అనంతరం మిగిలే మానవ శరీర భాగాలు వంటి ప్రమాదకర జీవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అవి నిండి ఉన్నాయి. ఈ కంటైనర్లకు ఏసీలు లేకపోవడంతో వాటి నుంచి దుర్వాసన వచ్చేది. మెడికల్‌, బయో వ్యర్థాలతో కూడిన 263 కంటైనర్లలో దిగుమతి అయిన 3వేల టన్నుల వ్యర్థాలను, ఆ దేశ కస్టమ్స్‌ అధికారులు పోర్టుల్లో గుర్తించారు. శ్రీలంక నుంచి తిరిగి వాటిని ఎక్కడికి రవాణా చేస్తారో అన్న దానిపై కస్టమ్స్‌ అధికారులకు సరైన ఆధారాలు లభించలేదు. అటు శ్రీలంక పర్యావరణ కార్యకర్తల గ్రూప్‌ బయో వ్యర్థాల కంటైనర్లపై కోర్టును ఆశ్రయించింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వాటిని తిప్పి పంపాలని డిమాండ్‌ చేసింది. 2020లో ఈ పిటిషన్‌ అపీల్‌ను శ్రీలంక కోర్టు సమర్థించింది. దశల వారీగా చెత్తను ఆ దేశానికే తిరిగి రవాణా చేస్తున్నారు. మొత్తం 263 కంటైనర్లలో చివరిగా 45 కంటైనర్ల వ్యర్థాలను రవాణా నౌక ద్వారా కొలంబొ పోర్టు నుంచి బ్రిటన్‌కు పంపారు శ్రీలంక అధికారులు.

Read Also…  

IRCTC: తక్కువ ధరతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే..