Joe Biden: ప్రపంచానికి ఫైజ‌ర్ వ్యాక్సిన్లు.. మిత్ర దేశాలకు అమెరికా భరోసా.. జీ7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ కీలక ప్రకటన?

|

Jun 10, 2021 | 11:15 AM

అమెరికా- ఐరోపా దేశాల మధ్య బంధాలు మెరుగ్గానే ఉన్నట్టు చైనా, రష్యాలకు యూరోప్ పర్యటన సందర్భంగా స్పష్టం చేయనున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.

Joe Biden: ప్రపంచానికి ఫైజ‌ర్ వ్యాక్సిన్లు.. మిత్ర దేశాలకు అమెరికా భరోసా..  జీ7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ కీలక ప్రకటన?
Joe Biden
Follow us on

Jeo Biden First Official Overseas Trip: అమెరికా- ఐరోపా దేశాల మధ్య బంధాలు మెరుగ్గానే ఉన్నట్టు చైనా, రష్యాలకు యూరోప్ పర్యటన సందర్భంగా స్పష్టం చేయనున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఐరోపాలో ఎనిమిది రోజల పాటు పర్యటించనున్న నేపథ్యంలో బైడెన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా బైడెన్​కు ఇది తొలి విదేశీ పర్యటన.

బుధ‌వార‌మే బ్రిట‌న్ చేరుకున్న బైడెన్‌.. ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను క‌ల‌వ‌నున్నారు. యూరోప్ దేశాల్లో మొత్తం 8 రోజుల పాటు బైడెన్ ప‌ర్య‌టించ‌నున్నారు. విండ‌ర్స్ క్యాసిల్‌లో ఆయ‌న క్వీన్ ఎలిజ‌బెత్‌ను క‌ల‌వ‌నున్నారు. అధ్యక్ష హోదాలో తొలి నాటో స‌మావేశంలో బైడెన్ పాల్గొంటారు.

చైనాను కట్టడి చేసేందుకు మిత్ర దేశాల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. అగ్రరాజ్య అధినేత బైడెన్. మాజీ అధ్యక్షుడు ట్రంప్​ హయాంలో ఐరోపాతో దెబ్బతిన్న దౌత్యసంబంధాలను పునరుద్ధించడమే లక్ష్యంగా బైడెన్ ఈ పర్యటన చేపట్టనున్నారు. ఇక, జెనీవాలో జ‌రిగే ఓ స‌మావేశంలో ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ జో బైడెన్ భేటీకానున్నారు. ర‌ష్యాకు సంబంధించిన ఆయుధ నియంత్రణ‌, వాతావ‌ర‌ణ మార్పులు, ఉక్రెయిన్‌లో ర‌ష్యా జోక్యం, సైబ‌ర్ హ్యాకింగ్‌, న‌వాల్నీ జైలు శిక్ష లాంటి అంశాల‌పై బైడెన్ వ‌త్తిడి తెచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆ దేశం అమెరికాపై కవ్వింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని బైడెన్​ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి నుంచి రక్షించడంలో అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తోంది దీనిలో భాగంగా.. 50 కోట్ల ఫైజర్ టీకా డోసులు కొనుగోలు చేయనుంది. 92 పేద దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా అందించాలని అమెరికా భావిస్తోంది.

కొవాక్స్​ కూటమి..వచ్చే ఏడాది వ్యవధిలో కొవాక్స్ కూటమి ద్వారా ఈ టీకాలు అందజేయనుంది. జీ7 దేశాల సదస్సుకు ముందు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో 10 కోట్ల మంది కోసం 20 కోట్ల డోసులు సరఫరా చేయనుండగా.. వచ్చే ఏడాదిలో మిగిలిన 30 కోట్ల డోసులు అందించనున్నట్లు తెలిపాయి. ఇదే ప్రజాస్వామ్యం.. ప్రజలకు ఎల్లప్పుుడూ సేవ చేయటంలో ప్రజాస్వామ్య దేశాలే ముందుంటాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్ తెలిపారు. కరోనాను అంతం చేసే ఆయుధసామాగ్రి (వ్యాక్సిన్​లు) అమెరికా వద్దే ఉందన్నారు.

Read Also…Covaxin phase 4: కోవాగ్జిన్ వ్యాక్సిన్ 4 దశ ట్రయల్ కి సిద్ధపడిన భారత్ బయోటెక్ కంపెనీ.. త్వరలో మూడో ట్రయల్ ఫలితాల ప్రకటన..