AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ అణు కేంద్రంపై దాడులు చేస్తాం! ట్రంప్ అల్టిమేటం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్‌లోని ‘పికాక్స్‌ పర్వతం’ కింద రహస్యంగా ఉన్న అణు కేంద్రాన్ని త్వరలోనే ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. అక్కడ జరుగుతున్న అణు కార్యకలాపాలన్నింటినీ అమెరికా చాలా జాగ్రత్తగా గమనిస్తోందని అన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధం రాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు.

ఇరాన్ అణు కేంద్రంపై దాడులు చేస్తాం! ట్రంప్ అల్టిమేటం!
Us May Hit Iran Nuclear Site Says Trump
Sharada V
|

Updated on: Sep 05, 2026 | 1:17 PM

Share

ఇరాన్‌పై మిలిటరీ దాడులు ప్రారంభించి ఐదు నెలలు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఐదు నెలల కాలంలో ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని  తెలిపారు.

ఇరాన్‌లోని జాగ్రాస్ పర్వత శ్రేణిలో ఉన్న ‘కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా’ పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం అని పిలుస్తారు. నతాంజ్ అణు కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఇక్కడికి మార్చి ఉండొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలో భావించాయి. అయితే, ప్రస్తుతం ఈ కేంద్రంలో ఏ విధమైన కార్యకలాపాలు సాగుతున్నాయనే దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.

అమెరికా తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ ఈ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించింది. తమపై దాడులకు ప్రతిదాడులు చేస్తామని పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

పికాక్స్‌ పర్వతంపై దాడి జరిగితే పశ్చిమాసియా అల్లకల్లోలమే!

ట్రంప్ హెచ్చరించినట్లుగా పికాక్స్‌ పర్వతంపై అమెరికా గనుక దాడికి దిగితే, పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అమెరికా సైనిక చర్యతో ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పటికే హెచ్చరించినట్లుగా, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడులు జరిగే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ అంతటా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సౌదీకి 5 బిలియన్‌ డాలర్ల ఆయుధాల అమ్మకాలు!

పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు 5 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 42 వేల కోట్లు) భారీ ఆయుధ విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది.  ఇరాన్ తో పాటు  ఆ దేశ మద్దతు ఉన్న యెమెన్‌ హౌతీ రెబెల్స్ నుంచి సౌదీ అరేబియా నిరంతరం డ్రోన్, క్షిపణి దాడుల ముప్పును ఎదుర్కొంటోంది. దీనిని సమర్థంగా తిప్పికొట్టేందుకు, సౌదీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ డీల్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్ దేశాల్లో స్థిరత్వాన్ని కాపాడుతూ, తమ మిత్రదేశానికి పూర్తి రక్షణ కల్పించే దిశగా అమెరికా ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

మిలిటరీ అధికారులకు ట్రంప్ లై డిటెక్టర్ పరీక్షలు

కీలకమైన యుద్ధ రహస్యాలు, సున్నితమైన సమాచారం బయటకు లీక్‌ కావడాన్నితీవ్రంగా పరిగణించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీ అధికారులకు, వైట్‌హౌస్ సిబ్బందికి లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన సైనిక వ్యూహాలు, దాడులకు సంబంధించిన ప్లాన్లు బయటకు వెళ్లడం అమెరికా రక్షణ రంగానికి పెను ముప్పుగా మారిందని ట్రంప్ భావిస్తున్నారు. లీక్‌ల వెనుక ఎవరున్నారనేది తేల్చేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి.

Follow Us