Canada: కెనడాలో స్పై బెలూన్ కలకలం..! అనుమానాస్పద వస్తువును పేల్చివేసిన అమెరికా యుద్ధ విమానాలు..
చైనా- అమెరికా మధ్య స్పై బెలూన్ వార్ నడుస్తోంది. ఇటీవల దక్షిణ కరోలినా సముద్ర తీరంలో అమెరికా పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరురోజులకు అలస్కా గగనతలంలో మరో అనుమానిత వస్తువును సైతం కూల్చివేసింది.
చైనా- అమెరికా మధ్య స్పై బెలూన్ వార్ నడుస్తోంది. ఇటీవల దక్షిణ కరోలినా సముద్ర తీరంలో అమెరికా పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరురోజులకు అలస్కా గగనతలంలో మరో అనుమానిత వస్తువును సైతం కూల్చివేసింది. ఈ స్పై బెలూన్ విషయంపై ఇప్పటికే అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల నిఘా బెలూన్‌ను పేల్చి వేసిన అమెరికా.. తాజాగా కెనడాతో కలిసి మరో అనుమానాస్పద వస్తువును కూల్చివేసింది.
కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న బెలూన్ లాంటి ఓ అనుమానాస్పద వస్తువును పేల్చివేసింది అమెరికా ఫైటర్ జెట్ F-22. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదేశాల మేరకు అమెరికా, కెనడా వాయుసేనలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ అనుమానాస్పద శకలాలు యూకాన్‌లో పడ్డాయని..వాటిని పరిశీలించనున్నట్టు తెలిపారు ట్రూడో.
ఇక రెండ్రోజుల క్రితం అమెరికాలోని అలస్కా దగ్గర 40వేల అడుగుల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియని వస్తువును కూడా పేల్చివేశారు. వరుసగా అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతుండటంతో అప్రమత్తమైంది అగ్రరాజ్యం. నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది.
కాగా, నిఘా బెలూన్ పేల్చివేసిన నాటినుంచి యూఎస్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ రక్షణస్థావరాలపై చైనా నిఘాపెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా.. తమ జోలికొస్తే.. ఎవర్నీ వదిలిపెట్టమంటూ డ్రాగన్ కంట్రీని హెచ్చరించింది. దీనిపై చైనా కూడా స్పందించింది. అది స్పై బెలూన్ కాదని.. పర్యావరణానికి సంబంధించినదని పేర్కొంది. దారితప్పి అమెరికా భూభాగంలోకి వచ్చినట్లు పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..