H1B: ఇండియన్స్ కు అమెరికా గుడ్ న్యూస్.. H1B, గ్రీన్ కార్డు విసాలపై కీలక నిర్ణయం..?

|

Sep 24, 2022 | 3:56 PM

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులు చాలా మంది ఎంచుకునే దేశం అమెరికా. ఆదేశంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటంతో భారతీయుల్లో ఎక్కువ మంది అక్కడ ఉద్యోగాలు చేయడానికి మక్కువ చూపిస్తారు. కొత్తగా ఉద్యోగాల కోసం..

H1B: ఇండియన్స్ కు అమెరికా గుడ్ న్యూస్.. H1B, గ్రీన్ కార్డు విసాలపై కీలక నిర్ణయం..?
Us Visa
Follow us on

Visa: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులు చాలా మంది ఎంచుకునే దేశం అమెరికా. ఆదేశంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటంతో భారతీయుల్లో ఎక్కువ మంది అక్కడ ఉద్యోగాలు చేయడానికి మక్కువ చూపిస్తారు. కొత్తగా ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు H1B వీసా పొందాల్సి ఉంటుంది. ఇది వర్కింగ్ విసా. అలాగే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్నవారు.. భవిష్యత్తులో అక్కడే షటిల్ అయిపోవాలనుకుంటే సిటిజన్ షిప్ పొందాల్సి ఉంటుంది. సిటిజన్ షిప్ కంటే ముందు వారు గ్రీన్ కార్డు పొందాలి. ఇలా H1B, గ్రీన్ కార్డులకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనిర్ణయం అమలులోకి వస్తే భారతీయులకు లబ్ధి చేకూరనుంది. H1B, గ్రీన్ కార్డు వీసాల ప్రాసెసింగ్​ వ్యవధిని 6 నెలలకు తగ్గించేందుకు ప్రభుత్వ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రెసిడెన్షియల్​ కమిషన్​ సిఫార్సులను ఆచరణలోకి తీసుకురావాలని అమెరికా అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. అమెరికాలో జీవిస్తున్న లక్షలాది మంది భారత్​, చైనా వలసదారుల కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది. ఏషియన్​ అమెరికన్స్​, నేటివ్​ హవాయన్స్​, ఫసిఫిక్​ ఐలాండర్స్​పై వేసిన ప్రెసిడెంట్​​ అడ్వైజరీ కమిషన్​.. మే 12న ఓ నివేదికను రూపొందించింది. ఇది శ్వేతసౌధానికి ఆగస్టు 24న చేరింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ వద్దకు తీసుకెళ్లే ముందు.. ఈ సిఫార్సులను వైట్​ హౌస్​ డొమెస్టిక్​ పాలసీ కౌన్సిల్​సమీక్షిస్తోంది.

గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ టైమ్: కొవిడ్​ కారణాలు, సిబ్బంది కొరత, 2017లో విధించిన ట్రావెల్​ బ్యాన్​తో.. గ్రీన్​ కార్డుల జారీ విషయంలో తీవ్రంగా ఆలస్యమైందని నివేదిక పేర్కొంది. జారీ చేయాల్సిన వాటికన్నా చాలా తక్కువు గ్రీన్​కార్డులు ఇచ్చినట్టు తెలిపింది. దీంతో.. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్టేట్​ నేషనల్​ వీసా సెంటర్​(NVC) భారీగా నియామకాలు చేపట్టి.. గ్రీన్​ కార్డు అప్లికేషన్లను త్వరగా ప్రాసెస్​ చేయాలని సూచించింది. 2022 ఆగస్టు నుంచి మూడు నెలల పాటు 100శాతం వీసా ఇంటర్వ్యూలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ విధంగా.. గ్రీన్​ కార్డుల జారీ విషయంలో కలిగిన అంతరాన్ని 2023 చివరి నాటికి పూడ్చివేయాలని స్పష్టం చేసింది. గ్రీన్​ కార్డు విసా ఇంటర్వ్యూలు, విసా ప్రాసెసింగ్​ కాల వ్యవధి గరిష్ఠంగా 6 నెలలు మించకూడదని నివేదిక తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్​లో ఉన్న వీసాలను త్వరితగతిన పూర్తి చేయాలని వెల్లడించింది. H 1B విషయంలో రెండు నెలల కాల వ్యవధిలోనే పనిని పూర్తిచేయాలని, వర్క్​ పర్మిట్​ పొడిగింపు లిమిట్​ని 180 రోజుల నుంచి 365 రోజులు పెంచాలని సూచించింది.

H1B వీసా ప్రాసెసింగ్ టైమ్: అమెరికాలో పని చేసేందుకు ఇతర దేశాల వారికి హెచ్​ 1బీ వీసాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. అక్కడకి వలస వెళ్లి జీవిస్తున్న ఇతర దేశస్థులకు.. గ్రీన్​ కార్డులు(పర్మినెంట్​ రెసిడెంట్​) ఇస్తుంది. ఇలా వెళ్లే వారిలో చైనా, ఇండియా నుంచే చాలా మంది ఉన్నారు. ఫలితంగా.. ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే.. భారతీయులకు లబ్ధి చేకూరినట్టు అవుతుంది. కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొస్తే అమెరికాలో ఉంటున్న ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..