UN General Assembly: యునైటెడ్ నేషన్స్ లో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత్.. మరికొన్ని దేశాలు కూడా..

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మిత్ర దేశం రష్యాకు భారత్ ఘలక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌ భూభాగంలోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే..

UN General Assembly: యునైటెడ్ నేషన్స్ లో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత్.. మరికొన్ని దేశాలు కూడా..
Un General Assenbly

Updated on: Oct 11, 2022 | 2:12 PM

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మిత్ర దేశం రష్యాకు భారత్ ఘలక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌ భూభాగంలోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై.. రష్యా రహస్య బ్యాలెట్ కోసం డిమాండ్‌ చేసింది. అయితే.. రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌ విషయంలో పునరాలోచించాలని రష్యా.. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తీర్మానంపై ఓటింగ్‌ రహస్య బ్యాలెట్‌తో జరగాలా.. బహిరంగంగా జరగాలా.. అనే విషయంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌ నిర్వహించింది. రహస్య ఓటింగ్‌కు రష్యా పట్టుబట్టగా.. ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటేసింది. మొత్తం 107 మంది సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. పదమూడు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో రష్యా, చైనా కూడా ఉన్నాయి.

రష్యా విజ్ఞప్తి మేరకు.. ఈ ఓటింగ్ నిర్వహించగా.. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. ఓటింగ్‌ అనంతరం రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. యునైటెడ్ నేషన్స్ సభ్యత్వం ఒక దారుణమైన మోసానికి సాక్ష్యంగా మారిందని, ఈ మోసంలో దురదృష్టవశాత్తు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు అని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ముసాయిదా ప్రకారం.. రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి, యుద్ధంలో దెబ్బతిన్న దేశం అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్‌పై దూకుడు యుద్ధాన్ని నిలిపివేయాలి. అలాగే.. రష్యా చర్యను గుర్తించవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది. బుధవారంగానీ, గురువారంగానీ ఈ తీర్మానంపై బహిరంగ ఓటింగ్‌ జరగనుంది.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుగన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్‌సన్‌, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించాయి. రష్యా రిఫరెండం చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అమెరికా-ఆల్బేనియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్‌ ఆ ఓటింగ్‌కు దూరంగా ఉంది. పైగా రష్యా వీటో జారీ చేయడంతో.. ఆ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఆల్బేనియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..