Russia-Ukraine crisis: మరో నెల రోజుల పాటు ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధింపు.. మార్షల్‌ లా ప్రయోగం

రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అవసరమైతే మార్షల్‌ చట్టం ప్రయోగిస్తామని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. పలు ప్రాంతాల్లో..

Russia-Ukraine crisis: మరో నెల రోజుల పాటు ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధింపు.. మార్షల్‌ లా ప్రయోగం
Ukraine

Updated on: Feb 23, 2022 | 4:50 PM

రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. నెలరోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అవసరమైతే మార్షల్‌ చట్టం ప్రయోగిస్తామని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించాలని నిర్ణయించారు. రష్యా యుద్దం చేసే అవకాశం ఉండడంతో రిజర్వ్‌ బలగాలను కూడా యాక్టివ్‌ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల వయస్సున వాళ్లు సైన్యంలో చేరాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. రష్యా దాడికి భయపడేది లేదని , ఎదురుదాడి చేస్తామన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి రష్యా బలగాలు . అమెరికా , బ్రిటన్‌ , జర్మనీ దేశాలు విధించిన ఆంక్షలకు భయపడడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ . తాజాగా రెండు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించింది అమెరికా.

ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తాజాగా చేసిన ట్వీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు. “పుతిన్ మరింత దూకుడు నుంచి నిరోధించడానికి” మరిన్ని ఆంక్షలు అవసరమని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి: Prashant Kishor: యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..

మల్లన్న సాగర్‌లో మరో అద్భుత దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రఘునందన్‌ మాటా మంతీ