Russia Ukraine War: క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి డ్రోన్ దాడి.. థర్మల్ పవర్ ప్లాంట్‌కు భారీ నష్టం

|

Dec 26, 2024 | 8:29 AM

రష్యా.. ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా రష్యా ఉక్రెయిన్ పై భారీ దాడి చేసింది. క్షిపణి, డ్రోన్ దాడులతో ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా తాము దాడి చేసినట్లు అంగీకరించింది. క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై చేసిన దాడి విజయవంతమైందని తెలిపింది.

Russia Ukraine War: క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి డ్రోన్ దాడి.. థర్మల్ పవర్ ప్లాంట్‌కు భారీ నష్టం
Russia Missile Drone Attack
Follow us on

ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి చేసింది. ఉక్రెయిన్ లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. రష్యా క్షిపణి దాడిలో ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లింది. క్షిపణి దాడితో ప్రజలు మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్నారు. రష్యా తాము చేసిన దాడిని అంగీకరించిందని.. క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై దాడి విజయవంతమైందని పేర్కొందని రష్యా ప్రభుత్వం చెప్పినట్లు BBC వార్త కథనం. మరోవైపు ఈ దాడి విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా 70కి పైగా క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. క్రిస్మస్ రోజున రష్యా ఉద్దేశపూర్వకంగా తమ దేశంపై దాడి చేసిందని అన్నారు.

రష్యా దాడి చేసిన సమయాన్ని ప్రస్తావిస్తూనే తాము ఈ దాడికి ప్రతి దాడి చేసేందుకు భారీగా సన్నద్ధత అవసరమని అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఈరోజు రష్యా చేసిన దాడి హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన దాడిని అని .. పుతిన్ ఉద్దేశపూర్వకంగా క్రిస్మస్ రోజును ఎంచుకున్నారు. ఇంతకంటే అమానుషం ఏముంటుందన్నారు జెలెన్స్కీ

ఇవి కూడా చదవండి

70కి పైగా క్షిపణులను, 100కి పైగా డ్రోన్లను ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్‌పై బాలిస్టిక్‌తో సహా 70కి పైగా క్షిపణులను, 100కు పైగా డ్రోన్‌లను రష్యా ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు. తమ శక్తి మౌలిక సదుపాయాలు లక్ష్యంగా పెట్టుకునే దాడులు చేసినట్లు చెప్పారు. అయితే 50కి పైగా క్షిపణులను, భారీ సంఖ్యలో డ్రోన్‌లను కూల్చివేయడంలో తమ దేశ సైనికులు విజయం సాధించారని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.

ప్రతి భారీ రష్యన్ సమ్మె తయారీకి సమయం అవసరం. ఇది ఎప్పుడూ యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఇది లక్ష్యాలను మాత్రమే కాకుండా సమయం మరియు తేదీని కూడా ఉద్దేశపూర్వక ఎంపిక.

విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో ఇంజినీర్లు నిమగ్నం

విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. దేశం కోసం పని చేస్తున్న, విధి నిర్వహణలో ఉన్న వారందరికీ ధన్యవాదాలు. రష్యా కుట్రలు ఉక్రెయిన్‌ను విచ్ఛిన్నం చేయవని చెప్పారు జెలెన్స్కీ.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..