Zelensky: రష్యా బలగాల దుశ్చర్యతో ఉదయం పూట నుంచే బాంబుల మోత.. టైమ్‌ మ్యాగజైన్‌లో జెలెన్‌స్కీ

Zelensky: ఉక్రెయిన్‌-రష్యాల (Ukraine-Russia) మధ్య వార్‌ కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై భీకరపోరును కొనసాగిస్తోంది. ఈ దాడులలో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. అయినా ఉక్రెయిన్‌ ..

Zelensky: రష్యా బలగాల దుశ్చర్యతో ఉదయం పూట నుంచే బాంబుల మోత.. టైమ్‌ మ్యాగజైన్‌లో జెలెన్‌స్కీ
Zelensky
Subhash Goud

|

Apr 30, 2022 | 12:54 PM

Zelensky: ఉక్రెయిన్‌-రష్యాల (Ukraine-Russia) మధ్య వార్‌ కొనసాగుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై భీకరపోరును కొనసాగిస్తోంది. ఈ దాడులలో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. అయినా ఉక్రెయిన్‌ రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇక తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు (Ukraine President) వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ముఖచిత్రంతో టైమ్‌ మ్యాగజైన్‌ ‘హౌ జెలెన్‌స్కీ లీడ్స్‌’ పేరుతో ఓ కవర్‌స్టోరీని ప్రచురించింది. రిపోర్టర్‌ సైమన్‌ షూస్టర్‌, అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా, ఉక్రెయిన్‌ కీలక అధికారులను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌-రష్యాల మధ్య మొదలైన యుద్దాల గురించి, అనుభవాలను వివరించారు. ఆ ఉదయం నాకు బాగా గుర్తుంది. రష్యా బలగాల దుశ్చర్యతో ఉదయం పూట నుంచే బాంబుల మోత మోగింది. నేను, నా భార్య, 17 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కొడుకు నిద్ర లేచాము. మా ఇద్దరు పిల్లలకు బాంబుల దాడి మొదలైందని తెలియజేశాము అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 ఇలాంటి ఘటనలు సినిమాల్లో తప్ప ఏనాడు చూడలేదు

వెంటనే కొంత మంది అధికారులు మా దగ్గరకు వచ్చారు. కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. రష్యా బలగాలు ఏ క్షణంలోనైనా కీవ్‌ నగరంలో అడుగు పెట్టవచ్చు. మీ కుటుంబం మొత్తాన్ని అంతమొందించే అవకాశాలున్నాయి.. ఇక్కడిని తరలిస్తామని మాకు వారు తెలిపారు. అధ్యక్ష భవనం గేటు ముందు భారీగా అధికారులు మోహరించారు. ఇలాంటి ఘటనలు సినిమాల్లో తప్ప ఏనాడు చూడలేదు అంటూ తెలిపారు. ఆ రాత్రంతా ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం ప్రాంగణంలో లైట్లన్ని ఆర్పివేశాము. నాకు, నా సిబ్బందికి బుల్లెట్‌ ఫ్రూప్‌ చాకెట్స్‌ ధరించమని చెప్పాను. అంతలోనే రష్యా బలగాలు. కానీ రష్యా దాడులకు మా దళాలు ప్రతిఘటించాయి అంటూ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

యుద్ధం ప్రారంభమైన గంటలోనే రష్యా దళాలు వచ్చాయి:

యుద్ధం ప్రారంభమైన మొదటి గంటల్లో రష్యా దళాలు వచ్చాయి. నా కార్యాలయం లోపల వారి తుపాకుల కాల్పులు వినిపించాయి. ఈ దాడుల కారణంగా వందలాది మంది బిక్కబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. భూగర్భంలో ఆహారం, నీరు, మందుగుండు సామాగ్రి అయిపోయింది అంటూ వివరించారు. కాగా, రెండు నెలలుగా కొనసాగుతున్న రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా క్రూరమైన దాడులను కొనసాగిస్తూ ఎంతో మందిని బలితీసుకుంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎన్నో భవనాలు, ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఒకప్పుడు సందడిగా ఉండే నగరాలను శిథిలావస్థకు చేర్చింది. వేలాది మంది మరణించారు. 53 లక్షల మందికి పైగా తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు. ప్రాణ హానీ ఉందని జెలెన్‌స్కీ కుటుంబం తలదాచుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించినా.. నా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే ఉంటాను.. అంటూ ధైర్యంతో తన సిబ్బందితో యుద్ధంలో పోరాటం కొనసాగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Watc Video: సౌదీ అరేబియాలో పాక్ ప్రధానికి చేదు అనుభవం.. ‘ఛోర్ ఛోర్’ నినాదాల హోరు

Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు మరో షాక్.. ఆ మందుల రేట్లు భారీగా పెంచిన ప్రభుత్వం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu