UK PM Rishi Sunak: బ్రిటన్ కొత్త చట్టంపై తీవ్ర దుమారం.!అక్రమ వలసలపై రిషి సునాక్ ఉక్కుపాదం.

|

Mar 09, 2023 | 12:30 PM

భారత సంతతికి చెందిన రిషి సునాక్ గతేడాది అక్టోబరులో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఆయన తీసుకొచ్చిన కొత్త చట్టం ఒకటి విమర్శలకు కారణమవుతోంది.

UK PM Rishi Sunak: బ్రిటన్ కొత్త చట్టంపై తీవ్ర దుమారం.!అక్రమ వలసలపై రిషి సునాక్ ఉక్కుపాదం.
Uk Pm Rishi Sunak Announces New Plan To Stop Surge Of Illegal Migrants
Follow us on

భారత సంతతికి చెందిన రిషి సునాక్ గతేడాది అక్టోబరులో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఆయన తీసుకొచ్చిన కొత్త చట్టం ఒకటి విమర్శలకు కారణమవుతోంది. హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు, మానవహక్కుల సంఘాలు తీవ్రంగా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అక్రమ వలసదారులను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా తెచ్చిన కొత్త పథకం అక్రమ వలసల కట్టడి బిల్లు విమర్శలకు తావు ఇస్తోంది. అయినా సరే ఆయన వెనక్కి తగ్గబోనని చెప్పారు రిషి. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ గట్టి హెచ్చరికలు చేశారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురాగా.. అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు యూకే ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వారిని సొంత దేశాలకు పంపించేస్తామని యూకే ప్రధాని స్పష్టం చేసింది. దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధిస్తాం’ అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌ ఛానెల్‌ గుండా చిన్న చిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉండగా.. గతేడాది సౌత్‌ఈస్ట్‌ ఇంగ్లండ్‌ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్‌కు చేరుకున్నారు. గత ఐదేళ్లలతో పోల్చితే వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.రిషి సునాక్‌ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్‌ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!