Viral: బాబోయ్.. మనోడికి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది మనవళ్లు, మనవరాళ్లు.. నవ్వకండి, సీరియస్ మ్యాటర్..!
రాచరిక యువగంలో రాజులు లెక్క లేనంతమంది మహిళలను పెళ్లిళ్లు చేసుకోవడం గురించి విన్నాం.. ప్రస్తుత కాలంలో ఇద్దరు, ముగ్గురు భార్యలను లిగి ఉండటం గురించి విన్నాం..
రాచరిక యువగంలో రాజులు లెక్క లేనంతమంది మహిళలను పెళ్లిళ్లు చేసుకోవడం గురించి విన్నాం.. ప్రస్తుత కాలంలో ఇద్దరు, ముగ్గురు భార్యలను లిగి ఉండటం గురించి విన్నాం.. మరి ఒక వ్యక్తి 12 మంది భార్యలను, 102 మంది పిల్లలను, 578 మంది మనవళ్లు, మనవరాళ్లను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విననైనా విన్నారా? అదేదీ లేకపోతే ఇప్పుడు చూసేయండి ఆ మగమహారాజును. అవును, ఈ పదం ఈ వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది. ఇతను ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేనా.. 102 మంది పిల్లల జన్మకు కారకుడై.. ఇప్పుడు ప్రపంచ సంచలనంగా మారాడు. మరి ఆడు మగాడ్రా బుజ్జీ అని అందరిచే అనిపించుకున్న వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటారు? అంత పెద్ద ఫ్యామిలీని అతను ఎలా రన్ చేస్తున్నాడు? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
ఉగాండాకు చెందిన మూసా హసస్య 12 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఆ 12 మంది భార్యలతో కలిసి 102 మంది సంతానానికి జన్మనిచ్చాడు. ఆ సంతానికి మళ్లీ సంతానం కూడా ఉందండోయ్. ఇతనికి మొత్తం 578 మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇంత మందిని పెళ్లి చేసుకుని, అంత మంది కన్న ఈ ఘనుడు.. ఇప్పుడు వారిని పోషించడానికి మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. తన ససంతానాన్ని సెంచరీ దాటించిన ఘనాపాటి.. ఆస్తులు భారీగా ఉన్నాయనుకుంటే మాత్రం పెద్ద పొరపాటే. ఆయనగారికి ఉన్నది కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే. దాని ఆధారంగానే మూసా అంతమందిని సాదాలు. కానీ, వాస్తవ జీవితంలో అది సాధ్యమయ్యేపని కాదు.. అది తెలిసొచ్చిన మూసా ఇప్పుడు నా వల్ల కావడం లేదు బోబోయ్ అని వాపోతున్నాడు. అంత మంది పిల్లలు, భార్యలకు తిండి పెట్టలేక, కట్టుకోవడానికి బట్టలు కొనివ్వలేక అవస్థలు పడుతున్నాడు.
అయితే, ఇంత మందిని పెళ్లి చేసుకోవడం, వంద మందికిపైగా పిల్లలను కనడానికి ఒక కారణం ఉందంటున్నాడు మూసా. పెద్దల మాటలు విని వంశాభివృద్ధి కోసం 12 మందిని పెళ్లి చేసుకున్నానని, 102 మంది పిల్లల్ని కన్నానని చెప్పుకొచ్చాడు. 1972లో 17 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్న మూసా.. సంవత్సరం తిరగకుండానే మొదటి బిడ్డకు తండ్రి అయ్యాడు. అలా క్రమంగా 102 మందికి తండ్రి అయ్యాడు మూసా. అయితే, అంతమంది పేర్లను గుర్తించుకోవడం, వారిని ఆలనాపాలనా చూసుకోవడం అతనికి కష్టంగా ఉందట. తన భార్యల సాయంతో.. వారి పేర్లను పలకడం, వారిని గుర్తుంచుకోవడం చేస్తాడట మూసా. ప్రస్తుతం అతని వయసు సుమారు 70 ఏళ్లు ఉండగా.. అతని సంతానంలో 50 ఏళ్ల వయసు వారు కూడా ఉండటం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..