COVID-19 Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశాలన్ని వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే యూఏఈ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో 1,93,187 మందికి టీకా ఇచ్చినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు యూఏఈలో కరోనా టీకా తీసుకున్న ప్రజల సంఖ్య 4.2 మిలియన్లు దాటినట్లు వెల్లడించారు. డిసెంబర్‌లో యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, జనవరి 10 నాటికి 10 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నాటికి నాలుగు మిలియన్ల మంది వ్యాక్సిన్‌ను పొందారు. శనివారం ఒక్క రోజే యూఏఈలో 3 వేల మందికిపైగా కరోనా బారిన పడగా, 12 మంది మరణించినట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.23కి చేరగా, మొత్తం 914 మంది మృతి చెందారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి రాగా, మరికొన్ని వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. అవి కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఇక యూకేలో కొత్తగా వ్యాప్తి చెందుతున్నస్ట్రెయిన్ వైరస్ ఇప్పటి వరకు 80 దేశాలకు పాకినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇప్పుడున్న వ్యాక్సిన్లు కొత్త రకం వైరస్‌పై ప్రభావం చూపుతుందోలేదోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్న రుణంలో ఈ వ్యాక్సిన్లులు కొత్త కరోనా వైరస్‌పై కూడా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Also Read: దేశవ్యాప్తంగా వేగంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 50 లక్షల మార్కును దాటిన టీకా పంపిణీ