China Tufan: చైనాలో వైఫా తుఫాన్ బీభత్సం… వందలాది భవనాలు ధ్వంసం
చైనా, హాంకాంగ్, దక్షిణ కోరియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. హాంకాంగ్‌లో 400 విమానాలు రద్దయ్యాయి. తుపాన్ బీభత్సానికి దక్షిణ కొరియాలో 17 మంది మృతి చెందారు. ముఖ్యంగా చైనాలోని పలు ప్రాంతాలను...

చైనా, హాంకాంగ్, దక్షిణ కోరియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. హాంకాంగ్‌లో 400 విమానాలు రద్దయ్యాయి. తుపాన్ బీభత్సానికి దక్షిణ కొరియాలో 17 మంది మృతి చెందారు. ముఖ్యంగా చైనాలోని పలు ప్రాంతాలను వైఫా తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. హాంకాంగ్‌లో అతి భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో 400కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. వందలాది చెట్లు నేలకూలాయి. విమాన, రవాణా సేవలు తీవ్ర అంతరాయం కలిగాయి. వైఫా తుఫాన్ చైనా దక్షిణ తీర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడడంతో పెద్దయెత్తున ఆస్తి నష్టం జరిగింది.
హాంకాంగ్‌లో గంటకు 100 మైళ్లకు పైగా వేగంతో వీచిన గాలులు విద్యుత్ సరఫరాను సర్వనాశనం చేసింది. రోడ్లు, రవాణా వ్యవస్థలు స్తంభించాయి. ప్రజా రవాణా సేవలు నిలిచిపోగా.. పాఠశాలలు, కాలేజీలను అధికారులు మూసివేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. అనవసర ప్రయాణాలు చేయవద్దని హాంకాంగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేసమయంలో చైనా ఆర్థిక వ్యవస్థపైనా తుఫాన్ ప్రభావం చూపింది. ముఖ్యంగా.. హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో భారీ బిల్డింగులు నేలమట్టం అయ్యాయి. ఇలాంటి తుఫాన్ బీభత్సం దక్షిణ చైనా, హాంకాంగ్‌లో ఇటీవలి సంవత్సరాల్లో సంభవించిన అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటని చైనా అధికార యంత్రాంగం భావిస్తోంది.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు, సహాయక బృందాలు ప్రజలను కాపాడేందుకు, ధ్వంసమైన ప్రాంతాలను శుభ్రపరిచేందుకు రంగంలోకి దిగాయి. చైనా, హాంకాంగ్‌లోని ప్రజల జీవన విధానంపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు.. విఫా తుఫాన్ వియత్నాంకు కూడా చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
