AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరం.. తలుచుకుంటేనే వణుకు…!

అమెరికాలోని అరిజోనా గగనతలంలో భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది.

ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరం.. తలుచుకుంటేనే వణుకు...!
Two Planes Nearly Collide After Flight Number Mix Up
Sharada V
|

Updated on: Aug 17, 2026 | 6:51 PM

Share

అమెరికాలోని అరిజోనా విమానాశ్రయం గగనతలంలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రయాణీకుల విమానాలకు పొరపాటున ఒకే ఫ్లైట్ నంబరు కేటాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి తో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు.

అసలేం జరిగింది?

‘అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2482’ విమానం చికాగో, ఫీనిక్స్ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. అయితే, చికాగోలో ప్రతికూల వాతావరణం వల్ల రావలసిన విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్‌లైన్ డిస్‌పాచ్‌ కేంద్రం ఫీనిక్స్ నుంచి తిరుగు ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని సిద్ధం చేసింది. ఇక్కడే అసలు పొరపాటు జరిగింది! డిస్‌పాచ్‌ సెంటర్‌లోని సిబ్బంది ఒకే సమయంలో రెండు విమానాలు గగనతలంలో ఉంటాయనే విషయాన్ని గమనించకుండా, రెండింటికీ ఒకే ఫ్లైట్ నంబర్ American 2482 ఇచ్చేశారు. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది.

’25 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి!’

తమ రేడియో హెడ్‌సెట్లలో ఒకే ఫ్లైట్ నంబర్‌ను వినడంతో పైలట్ల మధ్య అయోమయం మొదలైంది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్షణాల్లో నిర్ణయం తీసుకున్నారు. రాడార్ స్క్రీన్‌పై వారిని వేరు చేయడానికి చాకచక్యంగా “అమెరికన్ 2482 ఆన్ ది అరైవల్” వస్తున్న విమానం అనీ “అమెరికన్ 2482 ఆన్ ది డిపార్చర్” వెళ్తున్న విమానం అనీ సంబోధించడం ప్రారంభించారు.

అంతేకాకుండా, విమానాల మధ్య తగిన దూరాన్ని మెయిన్‌టెయిన్‌ చేసేందుకు  వస్తున్న విమానాన్ని ఎత్తులోనే ఉంచి, టేకాఫ్ అయిన విమానాన్ని ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా కింది స్థాయిలో నిలిపివేశారు. కొన్ని మైళ్ల దూరంలో ఉండగానే రెండు విమానాల పైలట్లు ఒకరినొకరు స్పష్టంగా చూసుకునేలా మార్గదర్శనం చేశారు. రెండు విమానాలు సురక్షితంగా ఒకదాన్ని మరొకటి దాటిన తర్వాత, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ చేస్తున్న పైలట్‌తో మాట్లాడుతూ, తను 25 ఏళ్లుగా పనిచేస్తున్నాననీ ఒకే కాల్ సైన్‌తో రెండు విమానాలు ఒకే చోట కలవడం ఎప్పుడూ చూడలేదనీ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అందుకు పైలట్ కూడా “గొప్ప పని చేశారు సార్‌!” అంటూ ప్రశంసించారు. ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణకు ఆదేశించాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి వల్లనే ప్రమాదం తప్పిందని, ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటనలో తెలిపింది.

Follow Us