Telangana: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఉండేది వీళ్లే!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో ఖాళీ అవ్వబోతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ తాజాగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవ్వబోతున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డికి అవకాశం కల్పించింది.
అయితే ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను టీపీసీసీ ఎంపిక చేసి హైకమాండ్‌కు పంపంగా.. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ తాజాగా అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కీలక ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి వర్గానికే కేటాయించడం ఇక్కడ గమనార్హం.
The AICC President, Shri Mallikarjun Kharge garu, has approved the following persons as party candidates for the forthcoming biennial elections to the Telangana Legislative Council from the Graduates' Constituencies: pic.twitter.com/sZqReooFtA
— Telangana Congress (@INCTelangana) September 29, 2026
అవును నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికైన సర్వోత్తం రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
