AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇంటి చిట్కాతో.. ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..

చాలామంది చర్మ సమస్యలతో నిత్యం ఇబ్బంది పడుతుంటారు. తరచుగా వచ్చే దురదలు, గజ్జి, తామర, రాషెస్‌ నల్ల మచ్చలు శరీరంపై ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, అలెర్జీల వల్ల, వాతావరణ సమస్యల వల్ల ఈ చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇవి తొందరగా తగ్గకపోవడం వల్ల నిరాశకు గురవుతుంటారు. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన సహజ ఔషధం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 29, 2026 | 8:17 PM

Share
కర్పూరం : ఐదు కర్పూరం బిళ్ళలను తీసుకుని మెత్తని పౌడర్‌గా చేసుకోవాలి. కర్పూరం చర్మ సమస్యలకు మంచిగా పనిచేస్తుంది. ఇది మొటిమలు, దురద, చర్మంపై మంట, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మాన్ని చల్లబరిచి, ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

1 / 5
నిమ్మరసం :  కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మకాయ చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిచి, కాంతివంతంగా చేస్తాయి. నల్ల మచ్చలను తగ్గించి, చర్మ రంగును సమానంగా మారుస్తుంది. నిమ్మకాయలోని ఆసిడ్‌లు చర్మం పై పొరలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

2 / 5
అలోవెరా జెల్:  పచ్చి అలోవెరా కొమ్మ నుండి తాజాగా తీసిన జెల్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ అందుబాటులో లేకపోతే, మంచి బ్రాండ్ అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరాలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది సూర్యరశ్మి వల్ల కలిగే కాలిన గాయాల నుండి ఉపశమనం పొందడానికి, చిన్న గాయాలను నయం చేయడానికి, చర్మం ఎర్రబడటం,  దురద వంటి చికాకులను తగ్గించడానికి సహాయపడుతుంది.

3 / 5

తులసి ఆకులు: ఒక కొమ్మ తులసి ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్‌గా నూరుకోవాలి. తులసి మొక్క చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే సూక్ష్మ క్రిములను చంపుతాయి. ఫైటోనియాసినామైడ్ వంటి పోషకాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

4 / 5
ఈ ఔషధాన్ని అప్లై చేసే ముందు, ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రమైన నీటితో కడిగి తుడిచి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత, ఈ పేస్ట్‌ను గజ్జి, తామర, మచ్చలు ఉన్న చోట క్రమం తప్పకుండా అప్లై చేయాలి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, మంట తగ్గి, గాయాలు త్వరగా నయమవుతాయి. కొన్ని మందులకు తగ్గని సమస్యలకు కూడా ఈ సహజ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది.

5 / 5
Follow Us